జీవ ఇంధనంతో తొలి విమానయానం

న్యూఢిల్లీ: భారతదేశంలో తొలిసారిగా జీవ ఇంధనంతో నడిచే విమానం ప్రయాణాన్ని సోమవారం విజయవంతంగా నిర్వహించారు. 72 సీట్ల సామర్థ్యపు స్పైస్ జెట్ విమానం ఈ రోజు డెహ్రాడూన్ నుంచి బయలుదేరి ఎలాంటి అవాంతరాలు లేకుండా దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం చేరుకుంది. దీనితో పాక్షికంగా బయో ఫ్యుయల్‌తో నడిచే విమానాల రాకపోకలకు అవకాశం ఏర్పడింది. పునరుత్థాన ఇంధన వనరుల వినియోగంతో నడిచే ఇటువంటి విమానాలతో దేశంలో విమానయానం వ్య యం తగ్గుతుందని స్పైస్ జెట్ అధికార వర్గాలు […]

న్యూఢిల్లీ: భారతదేశంలో తొలిసారిగా జీవ ఇంధనంతో నడిచే విమానం ప్రయాణాన్ని సోమవారం విజయవంతంగా నిర్వహించారు. 72 సీట్ల సామర్థ్యపు స్పైస్ జెట్ విమానం ఈ రోజు డెహ్రాడూన్ నుంచి బయలుదేరి ఎలాంటి అవాంతరాలు లేకుండా దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం చేరుకుంది. దీనితో పాక్షికంగా బయో ఫ్యుయల్‌తో నడిచే విమానాల రాకపోకలకు అవకాశం ఏర్పడింది. పునరుత్థాన ఇంధన వనరుల వినియోగంతో నడిచే ఇటువంటి విమానాలతో దేశంలో విమానయానం వ్య యం తగ్గుతుందని స్పైస్ జెట్ అధికార వర్గాలు తెలిపాయి. వ్యవసాయ వ్యర్థాలు, జట్రోఫా గింజలు, పారిశ్రామిక వ్యర్థాలలోని జీవ ఇంధన పదార్థాలు, మున్సిపాల్టీలలోని వ్యర్థాలతో ఈ బయోఫ్యుయల్‌ను రూపొందించి, ఇంధనంగా వినియోగించారు. దీని వినియోగంతో విమానయానం మరింత సమర్థవంతం, స్వచ్ఛం అవుతుందని, ప్రస్తుతం వాడుతున్న ఏవియేషన్ టర్బైన్ ఇంధనం వ్య యంతో పోలిస్తే ఈ జీవ ఇంధన వ్యయం తక్కువగా ఉం టుందని విమాన సంస్థ వారు తెలిపారు.

డెహ్రాడూన్‌కు చెందిన సిఎస్‌ఐఆర్  ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం వారు ఈ విమానయానానికి అవసరమైన జీవ ఇంధనాన్ని రూపొందించారు. ముందుగా దీని పనితీరు గురించి పలు దఫాలుగా ప్రయోగించి విమానయానం సురక్షితం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. జీవ ఇంధనంతో కదిలిన స్పైస్‌జెట్‌కు చెందిన క్యూ 400 టర్బోప్రాప్ విమానానికి సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌రావత్ డెహ్రాడూన్‌లోనిజోలీ గ్రాంట్ ఎయిర్‌పోర్టు నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ప్ర యోగాత్మక విమానయానం సందర్భంగా ఈ విమానం లో వైమానిక నియంత్రణ డిజిసిఎ, స్పైస్‌జెట్‌కు చెందిన అధికారులు, కొందరు ప్రముఖ పత్రికలు, టీవీ ఛానల్స్ ప్రతినిధులు కూడా ప్రయాణించారు. తమ అనుభవాన్ని తెలియచేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఈ తొలి జీవ ఇం ధన విమానం దిగినప్పుడు కేంద్ర మంత్రులు నితిన్ గడ్క రీ, సురేష్‌ప్రభు, ధర్మేంద్రప్రదాన్, డాక్టర్ హర్షవర్థన్, జయంత్ సిన్హా వంటి వారు అక్కడుండి స్వాగతం పలికారు. విమానయానం విజయవంతం అయినందుకు అభినందనలు తెలిపారు. ఇక ఈ విమానానికి కావల్సిన జీవ ఇంధనం తయారీలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 500 రైతు కుటుంబాల కీలక పాత్ర కూడా ఉంది. ఈ కుటుంబాల వారు ఈ జీవ ఇంధన తయారీకి అవసరం అయిన జట్రోఫా విత్తనాలను పండించేందుకు తమ పంట పొలాలలో దీనిని సాగు చేశారు.

విమానాలకు తరచూ వాడుత్నున సాంప్రదాయ ఇంధనం: ఏవియేషన్ టర్బైన్ ఇంధనం
ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో వాడింది: జీవ ఇంధనం
దేనితో తయారు చేశారు: జట్రోపా మొక్కల నుంచి సేకరించిన విత్తనాల ద్వారా తీసిన ఆయిల్‌తో కలిపి..
ఇంధనం తయారీలో పాల్గొన్నదెవరు?: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 500రైతు కుటుంబాలు
విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించింది?: డెహ్రాడూన్ హ్‌న్యూఢిల్లీ
లక్ష్యం: గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించడం, 2035నాటికల్లా విమానాల్లో వీలైనంత మేరకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్ దిగుమతిని తగ్గించుకోవడం. తద్వారా 50శాతం చార్జీలను తగ్గించడం
ఇప్పటి వరకు విమానాల్లో జీవ ఇంధనాన్ని వాడుతున్న దేశాలు: అమెరికా, ఆస్ట్రేలియా

Comments

comments