జీవితంపై విరక్తితో యువకుడి ఆత్మహత్య

Young Man Sucide Attempted In Vikarabad District
కోహీర్ ః జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం… మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎన్ గోపాల్ (22) గత కొన్ని నెలల నుంచి గోపాల్ తెలియని వ్యాధితో అవస్థలు పడుతున్నాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఉదయం ఇంటి నుంచి కోహీర్ నుంచి వికారాబాద్‌వైపు వెళ్లే రైలు పట్టాలపై తల పెట్టి పడుకున్నాడు. అటుగా రైలు వెళ్లడంతో గోపాల్ శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. వికారాబాద్ రైల్వే పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments