జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా దానకిషోర్

హెచ్‌ఎండిఎకి జనార్దన్‌రెడ్డి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజిగా చిరంజీవులు  మన తెలంగాణ / హైదరాబాద్ : ముగ్గురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడేళ్ళుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) కమిషనర్‌గా పనిచేస్తున్న జనార్దన్‌రెడ్డిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి శుక్రవారం ఉత్తర్వులు  జారీచేశారు. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దాన కిషోర్‌ను […]

హెచ్‌ఎండిఎకి జనార్దన్‌రెడ్డి
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజిగా చిరంజీవులు 

మన తెలంగాణ / హైదరాబాద్ : ముగ్గురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడేళ్ళుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) కమిషనర్‌గా పనిచేస్తున్న జనార్దన్‌రెడ్డిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి శుక్రవారం ఉత్తర్వులు  జారీచేశారు. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దాన కిషోర్‌ను జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా నియమించారు. ఇంతకాలం దానకిషోర్ నిర్వహిస్తున్న జల మండలి ఎండి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాధ్యతలను కూడా యధావిధిగా (అదనపు) నిర్వహిస్తారని తెలిపారు. హెచ్‌ఎండిఏ కమిషనర్‌గా ఇంతకాలం పనిచేస్తున్న చిరంజీవులును స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. ఇంతకాలం ఆ బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రస్తుతం వాకాటి కరుణ వైద్యారోగ్య శాఖ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు.

Comments

comments

Related Stories: