జిహెచ్‌ఎంసి అడిషనల్ కమిషనర్‌గా ఆమ్రపాలి…

Amrapali Appointed Ghmc Additional Commissioner

హైదరాబాద్: మంగళవారం జరిగిన ఐఎఎస్‌ల బదిలీలో స్వల్ప మార్పులు జరిగాయి. జిహెచ్‌ఎంసి అడిషనల్ కమిషనర్‌గా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలిని నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి అడిషనల్ కమిషనర్‌గా ఉన్న భారతి హొళికేరిని మంచిర్యాల కలెక్టర్‌గా బదిలీ చేశారు. అమయ్‌కుమార్ బదిలీని నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయన స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా రజత్‌కుమార్ సైనీని నియమించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న శశాంకను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. వ్యవసాయశాఖ కమిషనర్‌గా రాహుల్ బొజ్జాను నియమిస్తూ… ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

Comments

comments