జిల్లాను సేఫ్ సీటిగా మార్చేందుకే కార్డెన్ సెర్చ్

రాజోళి: జోగులాంబ గద్వాల జిల్లాను సెఫ్టీ సీటిగా మార్చేందుకే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పి రమా రాజేశ్వరి అన్నారు. రాజోళి మండల కేంద్రమైన నూతన వరద గృహాల దగ్గర గురువారం తెల్లవారు జామున కార్డెన్ సెర్చ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కార్డెన్ సెర్చ్‌ద్వారా ప్రజల్లో తాము ఉండే ప్రదేశాలు భద్రతో కూడున్నయన్న భరోసాను కల్పించేదుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని అమె తెలిపారు. హెల్‌మెంట్ లేకుండా, మధ్యం తాగి […]


రాజోళి: జోగులాంబ గద్వాల జిల్లాను సెఫ్టీ సీటిగా మార్చేందుకే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పి రమా రాజేశ్వరి అన్నారు. రాజోళి మండల కేంద్రమైన నూతన వరద గృహాల దగ్గర గురువారం తెల్లవారు జామున కార్డెన్ సెర్చ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కార్డెన్ సెర్చ్‌ద్వారా ప్రజల్లో తాము ఉండే ప్రదేశాలు భద్రతో కూడున్నయన్న భరోసాను కల్పించేదుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని అమె తెలిపారు. హెల్‌మెంట్ లేకుండా, మధ్యం తాగి వాహానాలు నడపడం పట్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, సామాజిక మద్యమాల్లో గత రెండు నెలలుగా వస్తున్న వదంతులను ఎవ్వరూ నమ్మవద్దని, గ్రామంలో ఎవరైన అనుమాస్పదంగా కన్పిస్తే పోలిసులకు సమాచారం అందిచాలి తప్పా, వారిపై దాడికి పాల్పడకూడదన్నారు. ఎలాంటి అవాంఛనీయా సంఘనలు చోటు చేసుకోకుండా నేరాలను అరికట్టేందుకు సర్పంచ్‌లతో సమావేశంమై సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో అత్యధికంగా నేరాలు నమోదు అవుతున్న ప్రాంతాల్లో క్రైం హాట్‌స్పాట్‌ను ఏర్పాటు చేసి నేరాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని అమె తెలిపారు. అంతంకు ముందు గ్రామంలోని తెల్లవారుజామున అర్‌డిటి, ఎస్‌సి కాలనీల్లో నివాసం ఉంటున్నవారి ఆధార్ కార్డులను, వాహానాలను సంబంధించిన ధృవ పత్రాలను పోలీసులు తనిఖీ నిర్వహించారు. రాజోళిలో మొత్తం 400 ఇండ్లల్లో తనిఖీ నిర్వహించి వారి వివరాలను నమోదు చేశారు. సరైన ధృవ పత్రాలు లేని 45 వాహనాలను 10 అటోలను పట్టుకుని పోలిస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సురేందర్‌రావు, సిఐ వెంకటేశ్వరరావు, రజిత, వెంకటేశ్వర్లు, 10మంది ఎస్‌ఐలు, 5మంది ఏఎస్‌ఐలు, 30మంది కానిస్టేబుల్, 10మంది హోం గార్డులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: