జియో కస్టమర్లందరికీ ఫ్రీగా 16 జిబి డేటా..!

Reliance jio offering 16gb free data

ముంబయి: రిలయన్స్ జియో తన కస్టమర్లకు మరో శుభవార్తను వినిపించింది. తన వినియోగదారులందరికీ ఉచితంగా 16 జిబి డేటాను అందిస్తున్నట్టు జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. జియో 2 వసంతాలను పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా వినియోగదారులకు రెండు వోచర్లు లభిస్తాయి. ఒక్కో వోచర్‌లో 8 జిబి డేటా ఉంటుంది. ఈ డేటాను కస్టమర్లు రోజుకు 2 జిబి చొప్పున 4 రోజుల్లో ఉపయోగించుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 20వ తేదీ లోపు ఒక వోచర్ కస్టమర్‌కు లభిస్తోంది. దానిని కస్టమర్లు రిడీమ్ చేసుకుంటే డేటా లభిస్తుంది. మరో వోచర్‌ను అక్టోబర్ నెలలో జియో ఇవ్వబోతోంది. పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే, కస్టమర్లు తమ తమ ఫోన్లలో మై జియో యాప్‌లోకి వెళ్లి మై ప్లాన్స్ సెక్షన్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

Comments

comments