జియోఫోన్ 2 నాలుగో ఫ్లాష్‌సేల్…

Jio phone 2 fourth flash sale

ముంబయి: జియోఫోన్ 2 కొనుగోలు చేయాలనుకునే వారి కోసం మరో ఫ్లాష్‌సేల్ ప్రకటించింది రిలయన్స్. ఇప్పటికే నిర్వహించిన ఫ్లాష్‌సేల్‌లో లక్షల మంది వినియోగదారులు ఈ ఫోన్‌ను కొనుగోలు చేశారు. జియోఫోన్ 2కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో నాలుగో ఫ్లాష్ సేల్‌ను సెప్టెంబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్టు సంస్థ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. 3 సేల్‌ను సెప్టెంబర్ 6న నిర్వహించిన సంగతి తెలిసిందే. 4జి ఫీచర్ ఫోన్ ఫిజికల్ కీబోర్డు, డ్యుయల్ సిమ్ వంటి సదుపాయాలను జియో ఫోన్ 2లో అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ.2,999 గా సంస్థ నిర్ణయించింది. ఈ ఫోన్‌ను కొన్నవారు జియోలో ఉన్న రూ.49, రూ.99 లేదా రూ.153 ప్లాన్లలో ఏదైనా ఒక ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందని రిలయన్స్ సంస్థ పేర్కొంది.

Comments

comments