జియోకు పోటీ…డేటాను డబుల్ చేసిన వొడాఫోన్

Vodafone
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో ఇటీవల రూ.198తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రోజుకు 2జిబి 4జి డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, డైలీ 100 ఎస్సెమ్మెస్‌లు ఇందులో లభిస్తున్నాయి. ఈ ప్లాన్‌కు పోటీగా వొడాఫోన్ తాజాగా తన రూ.199 ప్లాన్‌ను సవరించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఇప్పటి వరకు డైలీ 1.4 జిబి వస్తుండగా… ఇప్పుడు దానిని డబుల్ చేసింది. అంటే రోజుకు 2.8 జిబి ఇస్తుందన్న మాట. అయితే, వాయిస్ కాల్స్‌లో విషయంలో మాత్రం కొన్నినిబంధనలను  విధించింది. రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలకు మించి మాట్లాడడానికి అవకాశం లేదు. కాలపరిమితి 28 రోజులే… అయితే, ఈ ప్లాన్‌లో ఎస్సెమ్మెస్ ప్రయోజనాలు లభించవని వొడాఫోన్ వెల్లడించింది. వొడాఫోన్ 4జి సర్వీసులున్న అన్ని సర్కిళ్లలోనూ వినియోగదారులకు అందుబాటులో ఉంది.