జిమ్ లో రకుల్ వర్కవుట్స్…

 Rakul preeth singh Workouts in the Gym

హైదరాబాద్‌: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ పై పెట్టే శ్రద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.  సమయం దొరికినప్పుడల్లా ఎక్కువ సమయం జిమ్ లోనే ఉంటుంది. ఫిట్ గా ఉండాలనుకునే వారి కోసం F45 ట్రైనింగ్ జిమ్ సెంటర్లను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా రకుల్‌ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. రకుల్ ఉదయం ఇలా ప్రారంభమైతే..చాలా ఉత్సాహంగా ఉంటుందని మనకు తెలుసు అని కామెంట్ పోస్ట్ చేసింది. రకుల్ జిమ్ వర్కవుట్స్ వీడియోను 7లక్షలమందికి పైగా వీక్షించారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Comments

comments