జిఎస్‌టి కౌన్సిల్ కీలక నిర్ణయం…

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో శుక్రవారం అసోం రాజధాని గౌహతిలో జరిగిన జిఎస్‌టి 23వ కౌన్సిల్ సమావేశంలో మండలి కీలక నిర్ణయం తీసుకుంది. జిఎస్‌టి అమల్లోకి తెచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు దానిని సమీక్షిస్తూ సవరణలను చేస్తున్న విషయం విదితమే. తాజాగా జిఎస్‌టి ప్రకారం 28 శాతం స్లాబులో ఉన్న 177 నిత్యావసర వస్తువులను ఆ స్లాబు నుంచి తొలగించారు. ఈ మేరకు జిఎస్‌టి మండలి సమావేశంలో […]

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో శుక్రవారం అసోం రాజధాని గౌహతిలో జరిగిన జిఎస్‌టి 23వ కౌన్సిల్ సమావేశంలో మండలి కీలక నిర్ణయం తీసుకుంది. జిఎస్‌టి అమల్లోకి తెచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు దానిని సమీక్షిస్తూ సవరణలను చేస్తున్న విషయం విదితమే. తాజాగా జిఎస్‌టి ప్రకారం 28 శాతం స్లాబులో ఉన్న 177 నిత్యావసర వస్తువులను ఆ స్లాబు నుంచి తొలగించారు. ఈ మేరకు జిఎస్‌టి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో చాక్లెట్లు, చూయింగ్‌గమ్‌లు, షాంపోలు, డియోడోరెంట్, షూ పాలిష్, డిటర్జెంట్, పోషకాహార పానీయాలు, కాస్మొటిక్స్ ధరలు తగ్గనున్నాయి. వీటిపై జిఎస్‌టి మండలి జిఎస్‌టి పన్నును 18 శాతంగా నిర్ణయించింది.

కేవలం 50 వస్తువులను మాత్రమే 28 శాతం స్లాబులో ఉంచారు. ఇప్పటివరకు 227 వస్తువులు 28 శాతం స్లాబులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా వస్తువులు 28 శాతం నుంచి 18శాతం శ్లాబులోకి వస్తాయని, తదనుగుణంగానే ధరలు కూడా తగ్గుతాయి’ అని బిహార్ ఆర్థికశాఖ మంత్రి సుశీల్ మోడీ తెలిపారు. కాగా, పెయింట్స్, సిమెంట్, విలాస వస్తువులు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు 28శాతం స్లాబులోనే ఉంచినట్లు ఆయన చెప్పారు. ఈ నిర్ణయంతో రూ.20వేల కోట్ల మేర ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపుతుందున్నారు. ఇక నాన్ ఎసి రెస్టారెంట్లపై జిఎస్‌టిని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించింది. దాదాపు 200 వస్తువులపై పన్ను రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించే నిర్ణయం తీసుకున్నట్లు అసోం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు.

Comments

comments

Related Stories: