జాన్ మిల్‌మ్యాన్‌పై జొకోవిచ్ విజయం

సెమీస్‌లో కీ నిషికోరితో ఢీ న్యూయార్క్: రెండుసార్లు చాంపియన్ అయిన నొవాక్ జొకోవిచ్ బుధవారం తన ప్రత్యర్థి, ఆస్ట్రేలియాకు చెందిన 55వ ర్యాంకర్ జాన్ మిల్‌మ్యాన్‌ను వరుస సెట్లలో ఓడించి సెమీస్‌లో ప్రవేశించాడు. తదుపరి అతడు సెమీస్‌లో జపాన్ ఆటగాడు కీ నిషికోరితో తలపడనున్నాడు. మిల్‌మ్యాన్‌ను 63, 64,64తో వరుససెట్లలో ఓడించిన జోకోవిచ్ ఇప్పుడు ఫ్లషింగ్ మిడోస్‌లో మూడో చాంపియన్‌షిప్‌కు మరింత చేరువయ్యాడు. అతడు టోర్నమెటు సెమీఫైనల్‌కు చేరడమన్నడి ఇది వరుసగా ఇది 11వ సారి. కుడి […]

సెమీస్‌లో కీ నిషికోరితో ఢీ
న్యూయార్క్: రెండుసార్లు చాంపియన్ అయిన నొవాక్ జొకోవిచ్ బుధవారం తన ప్రత్యర్థి, ఆస్ట్రేలియాకు చెందిన 55వ ర్యాంకర్ జాన్ మిల్‌మ్యాన్‌ను వరుస సెట్లలో ఓడించి సెమీస్‌లో ప్రవేశించాడు. తదుపరి అతడు సెమీస్‌లో జపాన్ ఆటగాడు కీ నిషికోరితో తలపడనున్నాడు. మిల్‌మ్యాన్‌ను 63, 64,64తో వరుససెట్లలో ఓడించిన జోకోవిచ్ ఇప్పుడు ఫ్లషింగ్ మిడోస్‌లో మూడో చాంపియన్‌షిప్‌కు మరింత చేరువయ్యాడు. అతడు టోర్నమెటు సెమీఫైనల్‌కు చేరడమన్నడి ఇది వరుసగా ఇది 11వ సారి. కుడి మోకాలి గాయం కారణంగా గత ఏడాది ఆడలేదు. 6వ సీడెడ్ ఆటగాడైన జొకోవిచ్ జూలైలో వింబుల్డన్ గెలిచాడు. క్వార్టర్‌ఫైనల్స్‌లో ఫెదరర్‌తో తలపడేలా జొకోవిచ్‌కు డ్రా పడింది.

కానీ 20సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ అయిన ఫెదరర్‌ను నాలుగో రౌండ్ నాలుగు సెట్లలో మిల్‌మ్యాన్ కంగుతినిపించి గెలిచాడు. కానీ అంతటి మిల్‌మ్యాన్‌ను జొకోవిచ్ దెబ్బతీశాడు. తీవ్ర పోటీ, చల్లని వాతావరణంలో మిల్‌మ్యాన్ చెమటతో తడిసి ముద్దయ్యాడు. సెకెండ్ సెట్‌లో ఇద్దరు 2తో సమానం అయినప్పుడు తన దుస్తులు మార్చుకున్నాడు. ‘నేను పోరాడాను, అతడూ పోరాడాడు. మేము చెమటతో తడిసిపోయాము. టిషర్టులు, షార్టులు పదేపదే మార్చాము’ అని జొకోవిచ్ చెప్పాడు. 2014లో యుఎస్ రన్నరప్ అయిన జపాన్‌కు చెందిన కీ నిషికోరితో శుక్రవారం జొకోవిచ్ తలపడనున్నాడు. కీ నిషికోరి గత యుఎస్ ఓపెన్ సీజన్‌లో మోచేతి గాయం కారణంగా మిస్సయమ్యాడు. ఇదిలా ఉండగా ‘పోటీలో నిలిచేందుకు ప్రయత్నిస్తా’ అని జొకోవిచ్ నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

Related Stories: