జానారెడ్డిపై నిప్పులు చెరిగిన కెసిఆర్

kcr fire on jana reddy

సిద్దిపేట: హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో టిఆర్ఎస్ అధ్యక్షులు  కెసిఆర్ కాంగ్రెస్ ఎంఎల్ఎ జానారెడ్డిపై ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కరెంట్ విషయంలో భయంకరమైన సమస్యలు ఉండేవని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని తాము చెప్తే, అధి సాధ్యమవుతదా..? అని జానారెడ్డి ప్రశ్నించారని కెసిఆర్ పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తే తానే గులాబీ కండువా కప్పుకొని టిఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తానని జానారెడ్డి నిండు శాసనసభలో చెప్పిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. జానారెడ్డికి నిజాయితీ ఉంటే ఆ పని చేసి చూపించాలని చురకలంటించారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదు అని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు కంటి వెలుగులో పరీక్షలు చేయించుకోని రాష్ర్టాభివృద్ధిని చూడాలని  కెసిఆర్ పేర్కొన్నారు.

Comments

comments