జలాలుద్దీన్ హక్కానీ మృతి

కాబుల్ : హక్కానీ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీ మృతి చెందాడు. కొంతకాలంగా హక్కానీ అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచాడు. ప్రస్తుతం హక్కానీ నెట్‌వర్క్ అధినేతగా అతని కొడుకు సిరాజుద్దీన్ ఉన్నాడు. తాలిబన్ డిప్యూటీ లీడర్ కడా ఇతనే కావడం గమనార్హం. ఆఫ్ఘనిస్థాన్‌లో అత్యంత ప్రమాదకర మిలిటెంట్ సంస్థగా హక్కానీ గ్రూపు పని చేస్తోంది. 1980లో ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి చేసిన సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా జలాలుద్దీన్ పని చేశాడు. అతడికి పాక్ సాయం కూడా ఉంది. అరబ్ […]

కాబుల్ : హక్కానీ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీ మృతి చెందాడు. కొంతకాలంగా హక్కానీ అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచాడు. ప్రస్తుతం హక్కానీ నెట్‌వర్క్ అధినేతగా అతని కొడుకు సిరాజుద్దీన్ ఉన్నాడు. తాలిబన్ డిప్యూటీ లీడర్ కడా ఇతనే కావడం గమనార్హం. ఆఫ్ఘనిస్థాన్‌లో అత్యంత ప్రమాదకర మిలిటెంట్ సంస్థగా హక్కానీ గ్రూపు పని చేస్తోంది. 1980లో ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి చేసిన సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా జలాలుద్దీన్ పని చేశాడు. అతడికి పాక్ సాయం కూడా ఉంది. అరబ్ జిహాదీలతోను జలాలుద్దీన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఒసామా బిన్ లాడెన్‌కు కూడా జలాలుద్దీన్ మంచి స్నేహితుడు. జలాలుద్దీన్ మృతిపై తాలిబన్ ప్రకటన చేసింది. అనారోగ్యంతో జలాలుద్దీన్ మృతి చెందినట్టు తాలిబన్ పేర్కొంది. నాటోతో పాటు ఆఫ్ఘన్ ప్రభుత్వ దళాలపై హక్కానీ నెట్‌వర్క్ దాడులు చేస్తున్న విషయం విదితమే.

Jalaluddin Haqqani Passed Away

Comments

comments

Related Stories: