జర పైలం

The threat to health with mussel rains

విజృంభించనున్న విష జ్వరాలు
పెరగనున్న దోమలు
ముసురు వర్షాలతో ఆరోగ్యాలకు ముప్పు
డెంగీ, మలేరియా, చికన్‌గున్యా వంటి వ్యాధుల పట్ల అప్రమత్తం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం
పల్లెలకు చేరుతున్న వైద్య సిబ్బంది
అంటువ్యాధులపై ప్రజలకు అవగాహన

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ ప్రతినిధి : వర్షాకాలంతోపాటు విష జ్వరాలు కూడా తోడుగానే వస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుండగా, సీజనల్ వ్యాధులు ఎక్కడ ప్రభలుతాయోనన్న ఆందోళనలో ప్రజలు భావిస్తున్నారు. పల్లెల్లో పారిశుద్ధం లోపం కారణంగా దోమలు పెరిగి డైఏరియా, మలేరియా, టైపాయిడ్, డెం గ్యూ తదితర వ్యాధులు సోకే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ, ఆటవీ ప్రాం తాల్లో కుంటల్లో నీళ్లు నిలువ ఉండడంతో దోమలు పెరిగి విషజ్వరాలు ప్రభలే అవకాశం ఉన్నాయి. వ్యాధులు సోకకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటు న్నా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. రోగులతో అన్ని ఆసుపత్రులు కిటకిటలాడే సమయం. ప్రైవేట్ ఆసుపత్రులకు కాసులు కురిపించే కాలం కూడా ఇ దే. వర్షాకాలంలో రోగాలు దరిచేసే అవకాశం ఉన్నాయి. మనుషులను వ్యాధులతో అతలాకుతలం చేసే సమయం ఇదే. ఆర్థికంగా అనారోగ్యాలకు ఖర్చుపెట్టే కాలం కూడా ఇదే. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జిల్లాలో ముసురు వర్షాలు పడుతుండడంతో గ్రామాల్లో మురికి కుంటల్లో నీటి నిలువలు చేరి దోమలు ప్రబలుతున్నాయి. వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం వైద్యాధికారులతో చర్యలు తీసుకుంటున్నా ప్రజలు కూడా వ్యాధుల పట్ట అవగాహన ఉండాలన్నారు. డైఏరియా వ్యాధి రాకుండా ఉడేందుకు నీళ్లను వేడి చేసి చల్లారి తర్వాత తీసుకోవాలి. ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లల్లో ఈగ లు, దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలి. వాంతులు, విరేచనాలు వచ్చిన వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ సరైన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మలేరియా కేసుల్లో ప్రస్తుతం జిల్లాలో నమోదు కాకపోయినప్పటికీ నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రజలకు దోమ కాటు వల్ల మలేరియా ప్రబలే అవకాశం ఉంది. మలేరియా వ్యాధి దోమకాటు వల్ల వ్యాప్తి చెం దుతుంది. కడుపు, తలనొప్పి, చలిజ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి ఉంటే మలేరియా లక్షణాలుగా భావించి సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి సరైన వైద్యం అందించాలి. చికెన్‌గున్యాకు ఈజిప్టు అనే దోమ వల్ల వ్యాప్తి ఎందుతుంది. ఈ దోమ కుట్టిన వారికి వ్యాధి లక్షణాలు బయటపడతాయని జ్వరం, ఒళ్లు, తల, కిళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. గెండు వ్యాధికి కూడా రాకుండా ఉండేందుకు ప్రజలు అప్రమత్తం గా ఉండాలి. రక్తం ప్లేస్లేట్స్ పడిపోవడం వల్ల ఒక్కసారి రోగిని ప్రాణాంతమయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాధుల పట్ల రక్తపరీక్షలు నిర్వహించి సరైన వైద్య చేసుకోవాలి. వర్షాకాలంలో ప్రబలుతున్న వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
* ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సేవలు
వర్షాకాలంలో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందన్నందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని చర్యలు చేపట్టింది. వైద్యులతోపాటు సిబ్బందిని అప్రమత్తం చేసింది. గ్రామాల్లో శుభ్రంగా ఉంచేందుకు బ్లీచింగ్ పౌడర్‌ను చల్లి, మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయిస్తున్నారు. వ్యాధులపట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రూపులతో చైతన్యం కల్పిస్తోంది. గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు, ప్రజలకు వైద్య సదుపాయాలు అందిస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో విష జ్వరా లు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.