జర్నలిస్టులకు జైలు శిక్ష

Journalists Imprisoned in Myanmar

మయన్మార్ : మయన్మార్‌లో రాయిటర్స్ దినపత్రికకు చెందిన ఇద్దరు జర్నలిస్టులకు మయన్మార్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దేశ రహస్యాలను విదేశాలకు చేరవేస్తున్నారని జర్నలిస్టులు వా లోనే (32), కియా సో ఓ (28)లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వీరిని గత ఏడాది అరెస్టు చేశారు. జర్నలిస్టులను విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి మయన్మార్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే జర్నలిస్టులకు శిక్ష విధించడాన్ని రాయిటర్స్ ఎడిటర్ చీఫ్ స్టీఫెన్ జూ అడ్లెర్ ఖండించారు. ఇది మయన్మార్‌లో బ్లాక్‌డే అని ఆయన పేర్కొన్నారు. తక్షణమే జర్నలిస్టులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Journalists Imprisoned in Myanmar

Comments

comments