జయ సమాధి పక్కనే కరుణ సమాధి

Chennai : Karunanidhi Tomb Beside of Jaya Tombచెన్నయ్ : అనారోగ్యంతో మృతి చెందిన డిఎంకె చీఫ్, తమిళనాడు మాజీ సిఎం కరుణానిధి అంత్యక్రియలు చెన్నయ్‌లోని మెరీనా బీచ్‌లో బుధవారం సాయంత్రం 6గంటలకు జరగనున్నాయి. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. మెరీనా బీచ్‌లో మాజీ సిఎంలు అన్నాదురై, ఎంజిఆర్, జయలలితల సమాధులు ఉన్నాయి. కరుణానిధి అంత్యక్రియలు కూడా ఇక్కడే జరగనున్నాయి. కరుణానిధి రాజకీయ గురువు, డిఎంకె వ్యవస్థాపకులు అన్నాదురై, తన రాజకీయ ప్రత్యర్థి జయలలిత సమాధుల మధ్యలోనే కరుణానిధి సమాది ఉండనుంది. మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు మొదట తమిళనాడు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో డిఎంకె నేతలు మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లోనే నిర్వహించాలని, అందుకు స్థలం కేటాయించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లోని అన్నాదురై, జయలలిత స్మారకాల వద్ద జరగనున్నాయి.

Comments

comments