జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్‌

న్యూఢిల్లీ: గవర్నర్ పాలనలో ఉన్నజమ్మూకశ్మీర్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్‌ను నియమించింది. బిజెపి సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు సత్యపాల్ మాలిక్‌ను జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన బీహార్ గవర్నర్‌గా ఉన్నారు. ఆయనను జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మాలిక్ నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. సత్యపాల్ మాలిక్‌తో పాటు 7 రాష్ట్రాల కొత్త గవర్నర్లను కూడా కేంద్ర మంగళవారం నియమించింది. బీహార్‌ గవర్నగా వాజ్‌పేయి సన్నిహితుడుగా పేరున్న […]

న్యూఢిల్లీ: గవర్నర్ పాలనలో ఉన్నజమ్మూకశ్మీర్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్‌ను నియమించింది. బిజెపి సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు సత్యపాల్ మాలిక్‌ను జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన బీహార్ గవర్నర్‌గా ఉన్నారు. ఆయనను జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మాలిక్ నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. సత్యపాల్ మాలిక్‌తో పాటు 7 రాష్ట్రాల కొత్త గవర్నర్లను కూడా కేంద్ర మంగళవారం నియమించింది. బీహార్‌ గవర్నగా వాజ్‌పేయి సన్నిహితుడుగా పేరున్న లాల్జీ టాండన్ నియమించబడ్డారు. జమ్మూకశ్మీర్ ప్రస్తుతం గవర్నర్‌ పాలనలో ఉండగా… నరేంద్ర నాథ్ వోహ్రా స్థానంలో సత్యపాల్ మాలిక్ (71) త్వరలో పగ్గాలు చేపట్టనున్నారు.

Comments

comments

Related Stories: