‘జబర్దస్త్’కమెడిన్ కు అరుదైన గౌరవం

హైదరాబాద్: ప్రముఖ టివి చానెల్ లో ప్రసారమయ్యే కామెడి ప్రొగ్రాం ‘జబర్దస్త్’ ద్వారా పాపులర్ అయినా సుధాకర్ కు అరుదైన గౌరవం దక్కింది. సుధాకర్‌కు తమిళనాడులోని కోయంబత్తూర్‌ రాయల్‌ అకాడమి ఆర్ట్స్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. కళారంగంలో దేశవ్యాప్తంగా దాదాపు 5వేల స్టేజీ షోలు ఇచ్చినందుకుగాను యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌తో సత్కరించనుంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 8న దుబాయిలో నిర్వహించే ఓ కార్య క్రమంలో ఆయనకు డాక్టరేట్‌ను ప్రధానం చేయనుంది. తనకు […]

హైదరాబాద్: ప్రముఖ టివి చానెల్ లో ప్రసారమయ్యే కామెడి ప్రొగ్రాం ‘జబర్దస్త్’ ద్వారా పాపులర్ అయినా సుధాకర్ కు అరుదైన గౌరవం దక్కింది. సుధాకర్‌కు తమిళనాడులోని కోయంబత్తూర్‌ రాయల్‌ అకాడమి ఆర్ట్స్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. కళారంగంలో దేశవ్యాప్తంగా దాదాపు 5వేల స్టేజీ షోలు ఇచ్చినందుకుగాను యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌తో సత్కరించనుంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 8న దుబాయిలో నిర్వహించే ఓ కార్య క్రమంలో ఆయనకు డాక్టరేట్‌ను ప్రధానం చేయనుంది. తనకు గౌరవ డాక్టరేట్ రావడంపై సుధాకర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. సుధాకర్‌కు డాక్టరేట్‌ రావడంతో ఆయన స్వస్థలమై పాలమూరుకు చెందిన పలువురు కళాకారులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments

Related Stories: