జనాభా నియంత్రణ అందరి బాధ్యత

మన తెలంగాణ/సంగారెడ్డి : ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి జిల్లా ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ ప్రతి నిమిషానికి 34 మంది పిల్లలు పుడుతున్నారన్నారు. ప్రతి సంవత్సరం దేశ జనాభా కోటాది కోట్లకు పెరుగుతున్నదని, మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మూల కారణం […]

మన తెలంగాణ/సంగారెడ్డి : ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి జిల్లా ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ ప్రతి నిమిషానికి 34 మంది పిల్లలు పుడుతున్నారన్నారు. ప్రతి సంవత్సరం దేశ జనాభా కోటాది కోట్లకు పెరుగుతున్నదని, మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మూల కారణం అధిక జనాభా అని అన్నారు. మనమంతా జనాభా పెరుగుదల రేటును ప్రతి వేయి మంది జనాభాకు 10 మంది మాత్రమే పెరిగేలా చూడాలన్నారు. ప్రపంచంలో మొదటి దేశంగా చైనా 141 కోట్లు జనాభా ఉండగా, 2030 నాటికి మన దేశ జనాభా దాదాపు 153 కోట్లు దాటి చైనాను మించిపోనుందన్నారు. శరవేగంగా పెరుగుతున్న జనాభాకు మౌలిక సదుపాయాలు, జనాభాకు తగిన అవసరాలు అందించలేమన్నారు.
తెలంగాణ ఏర్పడినపుడు 2 జూన్ 2014లో సేకరించిన జనాభా లెక్కల ప్రకారం 3 కోట్ల 94లక్షల మంది జనాభా ఉందని, మన రాష్ట్రంలో ప్రతి చదరపు కి.మీ జన సాంద్రత 307, పురుషులకు 117.04 లక్షలు, స్త్రీలు 174.90 లక్షలు, మన సంగారెడ్డి జిల్లాలో 15,27, 628 ఇందులో పురుషులు 7,77,235, స్త్రీలు 75,0393, జనాభా నిష్పత్రి ప్రకారం 965/1000 ఉందన్నారు. 0-6 సంవత్సరాలోపు పిల్లలు 194974 అందు లో బాలురు 99,712, బాలికలు 95,262 నిష్పత్రి ప్రకారం 955/1000 పెరుగుదల, అక్షరాస్యత శాతం 62.53 అని పేర్కొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఆరోగ్యసిబ్బందికి పాఠశాలల్లో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన పిల్లలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డా. గాయిత్రి, డా.రాజేశ్వరీ, డా.శశాంక్, డెమో ప్రసాద్, వీర్‌కుమార్, రోటరీ క్లబ్ లింగాగౌడ్, విజయ్‌కుమార్, నారాయణ, సాంబయ్య, రెడ్‌క్రాస్ చందర్, జిల్లా విస్తరణ అధికారి సీతాగుండయ్య, జిల్లా ఏపిడమిక్ అధికారి సుగుణాకర్‌లు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మహిళా సభ నర్సింగ్ విద్యార్థులు, అంబేద్కర్ నర్సింగ్ విద్యార్థులు, గాయిత్రి హైస్కూల్, రెడ్‌క్రాస్ విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: