జనసేనానికి మరోసారి కంటి ఆపరేషన్…

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ కంటికి మరోసారి ఆపరేషన్ జరిగింది. పవన్ ఎడమ కన్ను చిన్న కురుపు కావడంతో జూలై నెలలో ఎల్ వి ప్రసాద్ కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నసంగతి తెలిసిందే. విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినప్పటికి పట్టించుకోకుండా పవన్ ప్రజాపోరాట యాత్రలో పాల్గొన్నారు. దీంతో ఆయన కంట్లో ఇన్ ఫెక్షన్ రావడంతో బంజారాహిల్స్ లోని ”సెంటర్ ఫర్ సైట్” కంటి దవాఖానలో గురువారం మరోసారి శస్త్ర చికిత్స […]

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ కంటికి మరోసారి ఆపరేషన్ జరిగింది. పవన్ ఎడమ కన్ను చిన్న కురుపు కావడంతో జూలై నెలలో ఎల్ వి ప్రసాద్ కంటి ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నసంగతి తెలిసిందే. విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినప్పటికి పట్టించుకోకుండా పవన్ ప్రజాపోరాట యాత్రలో పాల్గొన్నారు. దీంతో ఆయన కంట్లో ఇన్ ఫెక్షన్ రావడంతో బంజారాహిల్స్ లోని ”సెంటర్ ఫర్ సైట్” కంటి దవాఖానలో గురువారం మరోసారి శస్త్ర చికిత్స నిర్వహించారు. కొన్ని రోజుల పాటు పవన్ కల్యాణ్ కు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు సమాచారం.

Related Stories: