జగ్గారెడ్డి…జైలుకు తరలింపు

jagga reddy sent to chanchalguda jail

హైదరాబాద్: మాజీ ఎంఎల్ఎ జగ్గారెడ్డి తన కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా పాస్‌పోర్టు పొందిన కేసులో పోలీసులు సోమవారం ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డికి సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో జగ్గారెడ్డిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 25 వరకు జగ్గారెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. జగ్గారెడ్డిపై ఐపిసి 419, 420, 467, 468, 471, 370 సెక్షన్లతో పాటు పాస్‌పోర్టు చట్టం 1967 సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ చట్టం 1983 సెక్షన్ 24 కింద కేసు నమోదు చేశారు.

Comments

comments