జగ్గారెడ్డి అరెస్టు.. గాంధీలో వైద్య పరీక్షలు…

హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్‌ఎల్‌ఎ జగ్గారెడ్డిని హైదరాబాద్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగ్గారెడ్డి గతంలో నకిలీ ధ్రువపత్రాలతో వీసా పొంది కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లినట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ మేరకు నార్త్‌జోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నకిలీ పాస్ పోర్టు పొందారని తేల్చారు. దీంతో జగ్గారెడ్డిని పటాన్‌చెరువులో సాయంత్రం 6 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. పిటి వారెంట్‌పై జగ్గారెడ్డిని హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చారు. […]

హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్‌ఎల్‌ఎ జగ్గారెడ్డిని హైదరాబాద్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగ్గారెడ్డి గతంలో నకిలీ ధ్రువపత్రాలతో వీసా పొంది కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లినట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ మేరకు నార్త్‌జోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నకిలీ పాస్ పోర్టు పొందారని తేల్చారు. దీంతో జగ్గారెడ్డిని పటాన్‌చెరువులో సాయంత్రం 6 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. పిటి వారెంట్‌పై జగ్గారెడ్డిని హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చారు. కాగా, ఆయన అరెస్ట్‌కు నిరసనగా మంగళవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి బంద్‌కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. జగ్గారెడ్డిపై నమోదైన కేసులు అక్రమమని, కావాలని తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ సంగారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం జగ్గారెడ్డికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉత్తర మండల డిసిపి కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.

Comments

comments

Related Stories: