జగిత్యాలలో వ్యక్తి దారుణ హత్య…

murder of person in Jagithyala

జగిత్యాల: కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో బర్కం చిన్నరాజరెడ్డి (50) అనే వ్యక్తి హత్యకు గురైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం… రాజరెడ్డి గురువారం రాత్రి విందు భోజనానికి ఒంటరిగా వెళ్ళి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తల పై బండరాయితో కొట్టి హత్య చేసినట్టు తెలిపారు. కాగా.. మృత్యుని భార్య గతంలో తన భర్తతో గొడవ పడిన ఏనుగంటి వెంకట్ అనే వ్యక్తే కక్ష గట్టి తన భర్తను హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  సంఘట స్థలాన్ని మెట్‌పల్లి డిఎస్‌పి మల్లారెడ్డి, కోరుట్ల సి.ఐ. సతీష్‌చందర్ రావు, ఎస్.ఐ మధుకర్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వెంకట్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Comments

comments