జగన్ బహిరంగ లేఖకు యనమల కౌంటర్

Jagan-Mohan-Reddy-and-Yanam

అమరావతి: ఇడి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ లేఖకు ఎపి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇడి కేసులో జగన్ వాదన విచిత్రంగా ఉందని యనమల ఎద్దేవా చేశారు. ఈ కేసులో కుటుంబ ప్రమేయముందో లేదో జగనే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి చేయలేదని చెప్పలేని జగన్ …. వార్తలపై అభ్యంతరం ఎలా చెబుతారని ప్రశ్నించారు. జగన్ లేఖ ద్వారా ఆయన కుటుంబ ప్రమేయం ఉందని, ఈ కేసు ద్వారా సానుభూతి పొందేందుకు జగన్ ప్రయతిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన వైఖిరితోనే కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందన్నారు. కేసులో పేరు ఉండటాన్ని ఎక్కడ ఖండించలేదని, లేనిది ఉన్నట్లు వార్తలు రాస్తే తప్పుబట్టాలన్నారు. ఇడి కేసులో పేరు ఉందని జగన్ అడ్వకేట్లే చెపుతున్నారని, భారతి సిమెంట్ వ్యవహారంలో ఇడి ఆమెను ఏకంగా నిందితురాలిగా పేర్కొన్న విషయం తెలిసిందే. భారతి సిమెంట్స్‌ ఛైర్‌పర్సన్‌గా వై.ఎస్‌.భారతిరెడ్డి కొనసాగుతున్నారు. జగన్‌ గ్రూపు కంపెనీలన్నింటిలోనూ ఆమె డైరెక్టర్‌, లేదా ప్రధాన వాటాదారుగా ఉన్నారని ఇడి వెల్లడించింది.

Comments

comments