జంట దోషులు

  గోకుల్‌చాట్, లుంబినీపార్కు జంటపేలుళ్ల కేసులో ఇద్దరిని దోషులుగా ప్రకటించిన ఎన్‌ఐఎ కోర్టు ఇద్దరు నిర్దోషులు, సోమవారం శిక్షలు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిపైనా ఆరోజే 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత తీర్పు మన తెలంగాణ/ హైదరాబాద్: పదకొండేళ్ల్ల సుదీర్ఘ విచారణ అనంతరం హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబినీ పార్కు జంట బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. చంచల్‌గూడ జైలులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన (డెజిగ్నేటెడ్) […]

 

గోకుల్‌చాట్, లుంబినీపార్కు జంటపేలుళ్ల కేసులో
ఇద్దరిని దోషులుగా ప్రకటించిన ఎన్‌ఐఎ కోర్టు
ఇద్దరు నిర్దోషులు, సోమవారం శిక్షలు
ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిపైనా ఆరోజే
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత తీర్పు

మన తెలంగాణ/ హైదరాబాద్: పదకొండేళ్ల్ల సుదీర్ఘ విచారణ అనంతరం హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబినీ పార్కు జంట బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. చంచల్‌గూడ జైలులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన (డెజిగ్నేటెడ్) ప్రత్యేక న్యాయస్థా నం న్యాయమూర్తి శ్రీనివాస్‌రావు ఈ కేసులో ఇద్దరు నిం దితులను దోషులుగా తేల్చి మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించారు. దోషుల్లో అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీఖ్ షఫిక్ సయ్యద్‌లకు సోమవారం శిక్షలు ఖరారు కాను న్నాయి. ఇక సాదిక్ ఇష్రాక్ షేక్, ఫారూఖ్ సర్ఫూద్దీన్ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టి వేశారు. గోకుల్ చాట్, లుంబినీపార్కు బాంబు పేలుళ్లు, దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పెట్టిన కేసుల్లో పై విధంగా ఎన్‌ఐఎ తీర్పు వెల్లడించింది. ఇక ఈ కేసులో నిందితులకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన వ్యక్తిపై సోమవారం తుది తీర్పు ఇస్తారు. జంట బాంబు పేలుళ్ల కేసులో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని ఎన్‌ఐఎ నిరూపించడంలో విజయం సాధించింది. ఎనిమిది మందిపై అభియోగాలు నమోదుకాగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు.

మిగిలిన ఐదుగురు నిందితులు అనీఖ్ షఫీఖ్ సయిద్, సాదిక్ ఇష్రాక్ షేక్, ఫారూఖ్ సర్ఫూద్దీన్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్‌లు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. వీరిలో ఏ-1 అనిఖ షఫీఖ్ అహ్మద్, ఏ-2 అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలు దోషులుగా తేలగా ఏ-5 ఫారూక్ షర్పుద్దీన్, ఏ-6 మహ్మద్ సాధిక్ ఇస్రార్‌లను నిర్ధోషులుగా తేల్చారు. అక్బర్ ఇస్మాయిల్ బాంబు పెట్టాడు ఇదీ పేలకుండా నిర్వీర్యం చేశారు. ఈ కేసులో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న ఐదో వ్యక్తి అయిన మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్ నిందితులకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించాడు. ఈ కేసులో ఇంకా తీర్పు వెల్లడికాలేదు. సోమవారం అంజుమ్ దోషా, నిర్ధోషా అనే విషయం కోర్టు వెల్లడిస్తుంది. మక్కామసీదులో జరిగిన పేలుళ్లలో ఆర్‌డిఎక్స్‌ను ఉపయోగించి పేల్చారు. ఈ సంఘటనలో మాత్రం రెండవ తరగతి పేలుడు పదార్ధామైన నియోజెల్ 90 (ఇందులో అమ్మోనియం నైట్రేట్ ఉంటుంది)ని ఉపయోగించారు. పేలుడు పదార్థాలను విస్పోటన చేయటానికి టైమర్ సాధనాలను ఉపయోగించారు. పేలకుండా నిస్తేజం చేసిన ఒక బాంబులో క్వార్ట్ గడియారపు టైమరును వాడారని ఫోరెన్సిక్ సైన్స్ పరిశోధనశాలకు చెందిన దర్యాప్తు అధికారి రాంమోహన్ తెలియజేశారు. ఆగస్టు 25, 2007న జనసమ్మర్థంగా ఉండేచోట్ల బాంబు పేలుళ్లు జరిగి 42 మంది వరకు మరణించారు. మరో 70 మంది గాయపడ్డారు. రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న లుంబినీపార్కులో జరిగిన పేలుడులో 9 మంది మరణించాగా కోఠి వద్ద గల గోకుల్ చాట్ దుకాణం వద్ద జరిగిన పేలుగులో 33 మంది మరణించారు.
లుంబినీ పార్కు….
లుంబినీపార్కులో రాత్రి ఏడున్నరకు లేజర్ షో మొదలైంది. దాదాపు 500 మంది వరకు సందర్శకులు దాన్ని చూస్తున్నారు. వందేమాతర గీతాలాపన అప్పుడే పూర్తయింది. ‘గుడ్ ఈవినింగ్ హైదరాబాద్’ అంటూ స్వాగత వచనం..అప్పుడు సీట్ల మధ్యలో బాంబు పేలింది. కుర్చీలు గాల్లో తేలాయి. తలలు ఎగిరిపడ్డాయి. శరీర అవయవాలు, మాంస ఖండాలు చెల్లాచెదురుగా పడ్డాయి. సందర్శకులంతా భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. పేలుడు దాటికి ఘటనా స్థలిలో ఇద్దరు చనిపోగా మరో ఏడుగురు ఆసుపత్రిలో మృతి చెందారు.
గోకుల్ ఛాట్…
కోఠి ప్రాంతంలో గోకుల్ చాట్ ప్రముఖ స్థలం. సాయంత్రం వేళ ప్రజలక్కడ ఎక్కువగా గుమిగూడుతారు. చాట్ మసాల వంటి ఉత్తర భారత ఉపహారాలకు గత మూడు దశాబ్ధాలుగా పేరొందింది. ఘటన నాటి సాయంత్రం 7.40 ప్రాంతంలో బాగా రద్దీగా ఉన్న గోకుల్ చాట్ సెంటర్‌లో బాంబు పేలింది. పది మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 23 మంది ఆసుపత్రిలో మరణించారు. చనిపోయిన 42 మందిలో 39 మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు పంపించారు. లుంబినీ పార్కు పేలుడులో మరణించిన వారిలో ఏడుగురు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని అమృతవర్షిని ఇంజనీరింగు కళాశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. స్టడీ టూరు మీద హైదరాబాదు వచ్చిన ఈ విద్యార్థులు పేలుడు సంభవించిన సమయంలో లేజర్ షో తిలకిస్తున్నారు. అదే బృందములోని మరో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు.
దోషులు వీరే….
నిందితుడు1: పేరు:అనిఖ్ షఫిఖ్ సయ్యద్ అలియాస్ ఖాలెద్ అలియాస్ అష్రాఫ్
వయస్సు:26
చదువు:ఎసిఎంఇ కంప్యూటర్స్
చిరునామ:భాగ్యోదయనగర్ పుణె మహారాష్ట్ర
నిందితుడు 2 : పేరు: మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి అలియాస్ సయ్యద్ అలియాస్ యాకుబ్ అలియాస్ వినోద్
వయస్సు:26
వృత్తి: సెల్‌ఫోన్ రిపేరింగ్
చిరునామా: మీటనగర్ ఖాండ్వా పుణె మహారాష్ట్ర
నిర్ధోషులు వీరే…
నిందితుడు 3 : పేరు: మహ్మద్ సాదిక్ అలియాస్ యాసీర్ అలియాస్ ఇమ్రాన్
వయస్సు: 33
చదువు: సిఎంఎస్ కంప్యూటర్
చిరునామా:ట్రోంబే ముంబాయి
నిందితుడు 4 : పేరు:ఫారూఖ్ షర్ఫీద్దిన్ తర్కష్ అలియాస్ అబ్దుల్లా
వయస్సు: 26
వృత్తి: అడ్వడైజ్‌మెంట్ ఎజెన్సీ
చిరునామా: భాగ్యోదయనగర్ ఖండ్వా పుణె మహారాష్ట్ర
నిందితులకు ఆశ్రయం కల్పించిన వ్యక్తి మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్

Comments

comments

Related Stories: