ఛాటింగ్‌లో పడి తుపాకీతో కాల్చుకుంది..!

భోపాల్ : ఫోన్ మాట్లాడుకుంటూ ప్రమాదబారిన పడుతున్న ఘటనలు తరచూ వార్తల్లో వస్తున్నాయి. ఇలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో చోటుచేసుకుంది. ఓ యువతి తన స్నేహితుడితో వాట్సాప్‌లో వీడియో ఛాటింగ్ చేస్తుంది. అదే సమయంలో ఆమె చేతిలో లోడ్ చేసిన తుపాకీ ఉంది. దానితో ఆడుకుంటూ మాటల్లో పడి నుదిటిపై కాల్చుకోవడంతో చనిపోయింది. ఘటన వివరాల్లోకి వెళితే… గ్వాలియర్ నగరంలోని నారాయణ్ విహార్ కాలనీకి చెందిన ఆర్మీ మాజీ సుబేదార్ అర్వింద్ యాదవ్‌కు […]

భోపాల్ : ఫోన్ మాట్లాడుకుంటూ ప్రమాదబారిన పడుతున్న ఘటనలు తరచూ వార్తల్లో వస్తున్నాయి. ఇలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో చోటుచేసుకుంది. ఓ యువతి తన స్నేహితుడితో వాట్సాప్‌లో వీడియో ఛాటింగ్ చేస్తుంది. అదే సమయంలో ఆమె చేతిలో లోడ్ చేసిన తుపాకీ ఉంది. దానితో ఆడుకుంటూ మాటల్లో పడి నుదిటిపై కాల్చుకోవడంతో చనిపోయింది. ఘటన వివరాల్లోకి వెళితే… గ్వాలియర్ నగరంలోని నారాయణ్ విహార్ కాలనీకి చెందిన ఆర్మీ మాజీ సుబేదార్ అర్వింద్ యాదవ్‌కు కూతురు, కొడుకు ఉన్నారు. అర్వింద్ దంపతులు ఊరికి వెళ్లగా, ఇంట్లో కూతురు కరిష్మాయాదవ్ (21), కుమారుడు ఉన్నారు. అయితే, ఇంట్లో ఉన్న కూతురు సరదాగా తండ్రి తుపాకీ తీసుకొని స్నేహితుడితో ఛాటింగ్ చేస్తుంది. తుపాకీలో ఒక బుల్లెట్ లోడ్ చేసి ఉంది. కరిష్మా ఢిల్లీలోని తన స్నేహితుడితో వాట్సాప్‌లో వీడియో ఛాటింగ్ చేస్తూ లోడింగ్ చేసి ఉన్న తుపాకీని తన నుదుటిపై పెట్టుకొని ట్రిగ్గర్ నొక్కింది. అంతే తుపాకీలో ఉన్న బుల్లెట్ తలలోకి దూసుకెళ్లింది. బయటకు వెళ్లిన కరిష్మా సోదరుడు ఇంటికి వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉంది. దాంతో హూటాహుటిన ఆమెను సమీపలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది.

Comments

comments

Related Stories: