ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్…

 women Maoist killed in Chhattisgarh encounter

భద్రాద్రి కొత్తగూడెం:  జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందిన సంఘటన  చత్తీస్‌గఢ్  రాష్ట్రం దంతేవాడ జిల్లా భాన్సీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాసనపార అటవీ ప్రాంతంలో గ్రామస్తులతో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు డిఆర్జి, ఎస్టిఎఫ్ బలగాలు ఆ ప్రాంతంలో గాలింపులు చేపట్టాయి. అక్కడ సమావేశానికి ఏర్పాట్లు నిర్వహిస్తున్న మావోయిస్టులు జవాన్ల రాకను గమనించి మావోయిస్టులు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందింది. జవాన్లు సంఘటన స్థలం నుంచి మావోయిస్టు మృతదేహంతో పాటు మారణాయుధాలను స్వాధీన పరుచుకున్నట్లు జిల్లా ఎస్పి అభిషెక్ పల్లవ్ వెల్లడించారు.

 

Comments

comments