చైనా వల్లే అవరోధాలు: ట్రంప్

బీజింగ్ : అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సంబంధాలు మెరుగు పరుచుకోవడంలో చైనా అడ్డంకులు సృష్టిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవని బీజింగ్ వ్యాఖ్యానించింది. ట్రంప్ ఆరోపణలు అనుచితమైనవని ప్రకటించింది. చైనాతో ఉత్తర కొరియాకు ఎదురవుతున్న వాణిజ్య పరమైన చిక్కుల వల్లనే చైనా తమకు అడ్డంకులు సృష్టిస్తోందని ట్రంప్ ఆరోపించారు. చైనా నుంచి ఉత్తర కొరియా అంతులేని ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన అన్నా రు. ట్రంప్ వ్యాఖ్యలపై చైనా అధికారులు ఘాటుగా స్పందించారు. […]


బీజింగ్ : అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సంబంధాలు మెరుగు పరుచుకోవడంలో చైనా అడ్డంకులు సృష్టిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవని బీజింగ్ వ్యాఖ్యానించింది. ట్రంప్ ఆరోపణలు అనుచితమైనవని ప్రకటించింది. చైనాతో ఉత్తర కొరియాకు ఎదురవుతున్న వాణిజ్య పరమైన చిక్కుల వల్లనే చైనా తమకు అడ్డంకులు సృష్టిస్తోందని ట్రంప్ ఆరోపించారు. చైనా నుంచి ఉత్తర కొరియా అంతులేని ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన అన్నా రు. ట్రంప్ వ్యాఖ్యలపై చైనా అధికారులు ఘాటుగా స్పందించారు. నిజాలను వక్రీకరించడంలో అమెరికా ప్రపంచంలోనే అందరికన్నా ముందుంటుందని, అనేకమందితోపాటు తాను కూడా ఇదే అనుకుంటున్నానని చైనా మంత్రివర్గ ప్రతినిధి హువా చునియింగ్ బీజింగ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. అమెరికా వాదనని అంత సులభంగా అర్థం చేసుకోలేమని హువా చెప్పారు.

Comments

comments

Related Stories: