చైనాలో వింత…!(వీడియో)

బీజింగ్: మనిషి చనిపోయిన తర్వాత ఖననం చేసేటప్పుడు ఒంటిపై కొత్త బట్టలు తప్పిస్తే ఇంకా ఏమి ఉంచరనేది అందరికీ తెలిసిందే. అందుకే చెబుతుంటారు చనిపోయేటప్పుడు మనతో పాటు ఏమీ తీసుకువెళ్లలేమని… కానీ చైనాకు చెందిన ఓ వ్యక్తి తాను చనిపోతూ తనతోపాటు తనకెంతో ఇష్టమైన కారును కూడా తీసుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే… దక్షిణ చైనాలోని హెబెయి ప్రావిన్స్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన క్వై అనే వ్యక్తి కొన్నాళ్ల క్రింతం హుండాయ్ సోనాట కారును ఎంతో ముచ్చటపడి […]

బీజింగ్: మనిషి చనిపోయిన తర్వాత ఖననం చేసేటప్పుడు ఒంటిపై కొత్త బట్టలు తప్పిస్తే ఇంకా ఏమి ఉంచరనేది అందరికీ తెలిసిందే. అందుకే చెబుతుంటారు చనిపోయేటప్పుడు మనతో పాటు ఏమీ తీసుకువెళ్లలేమని… కానీ చైనాకు చెందిన ఓ వ్యక్తి తాను చనిపోతూ తనతోపాటు తనకెంతో ఇష్టమైన కారును కూడా తీసుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే… దక్షిణ చైనాలోని హెబెయి ప్రావిన్స్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన క్వై అనే వ్యక్తి కొన్నాళ్ల క్రింతం హుండాయ్ సోనాట కారును ఎంతో ముచ్చటపడి కొనుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఆ కారును ఎంతో ఇష్టంగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అయితే ఇటీవల క్వై అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో తాను చనిపోతానని తెలుసుకున్న క్వై తన కుటుంబ సభ్యులకు ఒక కోరిక కోరాడు. తాను చనిపోయిన తర్వాత తనతో పాటే తన కారును కూడా ఖననం చేయాలని చెప్పాడు. గత సోమవారం క్వై మృతి చెందాడు. దాంతో ఆయన కోరిక మేరకు కుటుంబీకులు కారుతో సహా ఖననం చేశారు. ఇప్పుడీ వింత సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

comments