చైతన్యను చూస్తే నాగార్జునను చూసినట్లు అనిపించింది

నాగచైతన్య, అను ఇమ్మాన్యుయల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతితో ఇంటర్వూ విశేషాలు… కుటుంబమంతా కలిసి చూడదగ్గ… ఇప్పటివరకు నేను తీసిన సినిమాలన్నింటిలోకంటే డిఫరెంట్ సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. కుటుంబమంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రమిది. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఎమోషనల్ సీన్లలో […]

నాగచైతన్య, అను ఇమ్మాన్యుయల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతితో ఇంటర్వూ విశేషాలు…

కుటుంబమంతా కలిసి చూడదగ్గ…
ఇప్పటివరకు నేను తీసిన సినిమాలన్నింటిలోకంటే డిఫరెంట్ సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. కుటుంబమంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రమిది. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది.
ఎమోషనల్ సీన్లలో అద్భుతంగా…
నటుడు ఎదిగే కొద్ది పరిణితి వస్తుంది. అలాంటి ఓ పరిణితిని నాగచైతన్యలో చూశాను. కొన్ని సీన్లలో అతని నటనను చూస్తే నాగార్జునను చూసినట్లు అనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో చైతన్య అద్భుతంగా నటించాడు.
డిఫరెంట్‌గా కనిపిస్తాడు...
సినిమా ఫస్టాఫ్‌లో లవ్‌స్టోరీ సెకండాఫ్‌లో ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది.
చైతన్య ఇప్పటివరకు లవర్‌బాయ్‌లా కనిపించాడు. ఈ సినిమాలో అలా ఉంటూనే డిఫరెంట్‌గా కనిపిస్తాడు నాగచైతన్య.
ఎలా అల్లుడయ్యాడనేదే కథ…
అత్త, అల్లుడు మధ్య ఛాలెంజ్ తరహా కథ కాదు ఇది. పూర్తిగా డిఫరెంట్ మూవీ. ఓ సాధారణ కుర్రాడు శైలజారెడ్డికి ఎలా అల్లుడయ్యాడనేదే సినిమా కథ. అంతే తప్ప అల్లుడు అయిన తర్వాత జరిగే కథ కాదు ఇది. అత్త, ఆమె కూతురితో ఉండే ఇగోయిస్టిక్ సమస్యలే ఈ సినిమా కథ.
ఫ్యామిలీ జోనర్ మూవీ…
దర్శకుడిగా ఇది నాకు ప్రత్యేకమైన సినిమా. ఇప్పటివరకు నేను డిఫరెంట్ సినిమాలు చేశాను. ఇది పూర్తిగా ఫ్యామిలీ జోనర్ మూవీ. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నేను తీసిన సినిమాల్లోకంటే ఇది చాలా రిచ్‌గా ఉంటుంది.
ఆద్యంతం వినోదాత్మకంగా…
నాగచైతన్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథ ఇది. సాధారణంగా అక్కినేని హీరోలు లవ్ స్టోరీలు, ఫ్యామిలీ స్టోరీలతో సక్సెస్‌లు సాధించారు. కాబట్టి నేను నా పరిధి దాటకుండా ఎంటర్‌టైన్‌మెంట్ మీద దృష్టి పెట్టి ఈ సినిమా చేశాను. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది.
రమ్యకృష్ణ విలన్ కాదు…
శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ చాలా చక్కగా నటించారు. అత్త, అల్లుడు మధ్య జరిగే కథతో సినిమా తెరకెక్కింది. అత్త విలన్‌గా ఉండటాన్ని ఎప్పటి నుండో చూస్తున్నాం. కానీ ఇది వాటన్నింటికీ భిన్నంగా ఉంటుంది. రమ్యకృష్ణ ఇందులో విలన్‌గా కనపడరు.
అందరికీ నచ్చేలా…
అల్లుడు బేస్ మీద సినిమా వచ్చి చాలా కాలమైంది. ఇలాంటి కథతో సినిమా చేస్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది. ఇక ఫ్యామిలీస్ సహా అందరికీ నచ్చేలా ఉండేవిధంగా ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్ పెట్టాం. ఈ టైటిల్‌తో రమ్యకృష్ణకు సినిమాలో ఉండే ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది. సినిమా క్లాస్‌గా ఉంటుంది.
అందుకే ఆమెను తీసుకున్నాం…
అను ఇమ్యాన్యుయల్ బయట ఎలా ఉంటుందో సినిమాలో కూడా అలాగే ఉంటుంది. హీరోయిన్ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందనుకొని తీసుకున్నాం. సినిమా చూసిన తర్వాత నేను రియల్‌గా ఉన్నట్టే సినిమాలో ఉన్నానని అను పేర్కొంది.
పెద్దగా తేడా ఉండదు…
చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పెద్దగా తేడా ఉండదు. నిజం చెప్పాలంటే చిన్న సినిమాకే ఎక్కువ కష్టం ఉంటుంది. ఇమేజ్ లేని నటీనటులతో తెరకెక్కే సినిమాతో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. ‘ఈరోజుల్లో’ సినిమా సమయంలో ట్రైలర్‌తో మెప్పించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగాం. అలాంటి మ్యాజిక్ జరిగితే తప్ప ప్రేక్షకులు సినిమాకు రావడం లేదు.
తదుపరి చిత్రాలు…
గీతా ఆర్ట్, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న సినిమా చేస్తున్నాను. మహేష్ సోదరి మంజుల నిర్మాణంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనే ఆసక్తి ఉంది. తను కూడా ఓ సందర్భంలో నన్ను అడిగాడు. అల్లరి నరేశ్‌తో కూడా సినిమా చేయాలనుంది.

Comments

comments

Related Stories: