చెర్రీ మూవీలో ఆర్యన్ కీ రోల్..?

హైదారబాద్: దివంగత స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న దర్శకుడు ఇవివి. ఆయన హఠాన్మరణం తెలుగు సినిమాకు తీరని లోటు అనే చెప్పాలి. ఆయన తన ఇద్దరు కొడుకులు నరేష్, రాజేష్ లను హీరోల్ని చేశాడు. నరేష్ అల్లరి సినిమాతో, రాజేష్ హాయ్ మూవీతో తెలుగు తెరకు హీరోలుగా పరిచయం అయ్యారు. నరేష్ హీరోగా పర్వాలేదనిపించిన రాజేష్ మాత్రం రాణించలేకపోయాడు. రాజేష్ వరుస ఫ్లాపులతో దాదాపుగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయాడు. పైగా […]

హైదారబాద్: దివంగత స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న దర్శకుడు ఇవివి. ఆయన హఠాన్మరణం తెలుగు సినిమాకు తీరని లోటు అనే చెప్పాలి. ఆయన తన ఇద్దరు కొడుకులు నరేష్, రాజేష్ లను హీరోల్ని చేశాడు. నరేష్ అల్లరి సినిమాతో, రాజేష్ హాయ్ మూవీతో తెలుగు తెరకు హీరోలుగా పరిచయం అయ్యారు. నరేష్ హీరోగా పర్వాలేదనిపించిన రాజేష్ మాత్రం రాణించలేకపోయాడు. రాజేష్ వరుస ఫ్లాపులతో దాదాపుగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయాడు. పైగా ఇవివి హఠాన్మరణంతో అతడి కెరీర్ అగమ్యగోచరంగా మారింది. ఇక ఆర్యన్ మళ్లీ తెరపై కనిపించడం కష్టమే అనుకుంటున్న సమయంలో తాజాగా అతడికి ఓ భారీ మూవీలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, బోయపాటి శ్రీను  కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో నరేష్ కు సూపర్ రోల్ దక్కిందని సమాచారం. ఇది ప్రతినాయక ఛాయలు ఉన్న పాత్ర అని అంటున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆర్యన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తాడట. ఈ పాత్ర కచ్చితంగా తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని రాజేష్ ఆశిస్తున్నాడట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.

Comments

comments

Related Stories: