చెన్నై విజయ లక్ష్యం163

rishab

న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు, చెన్నైకి 163 పరుగుల లక్షాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.రిషబ్ పంత్(38), విజయ్ శంకర్(36)లు రాణించడంతో పాటు హర్షల్ పటేల్(36) చివర్లో మెరుపులు మెరిపించాడు. మిగతా ఆటగాళ్లు విఫలమవ్వడంతో ఢిల్లీ జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి 2 వికెట్లు తీయగా, చాహర్, రవీంద్ర జడేజ, శార్థుల్ తలో వికెట్ పడగొట్టారు.

Comments

comments