చెన్నైలో గుట్కా కంపెనీలపై కొనసాగుతున్న దాడులు

Gutkhaచెన్నై: ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం చెన్నైలో అక్రమంగా నిర్వహిస్తున్న గుట్కా కంపెనీలు, గోదాంలపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం కూడా దాడులను కొనసాగించారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రూ. 65లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గుట్కా కంపెనీలు దాదాపు రూ. 250కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోందని అధికారులు చెప్పారు. దాడులు పూర్తిగా ముగిసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Comments

comments