చెన్నైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం..

Four Apartment Building Collapsed In Chennai

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలోని  పాతమహాబలిపురం కందన్ చావడిలో నాలుగు అంతస్థుల భవనం కుప్ప కూలింది.  కూలిన భవన శిథిలాల కింద 35 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న 17 మందిని స్థానికులు సురక్షితంగా బయటకి తీశారు. గాయ పడిన 17 మందిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

comments