చెత్త రికార్డు చెరిపెస్తాడా?

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఫార్మాట్ ఏదైనా పరు గుల వరద పారిస్తూ ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి ఇంగ్లండ్ పిచ్‌లు కొర కరాని కొయ్యాగా మారాయి. ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షి ణాఫ్రికా, విండీస్ తదితర జట్లతో జరిగే టెస్టు సిరీస్‌లలో విరాట్ కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగి పోతాడు. అయితే ఇంగ్లండ్ గడ్డపై మాత్రం అత్యంత దారుణంగా విఫలమవుతు వస్తున్నాడు. ఇక్కడ ఆడిన […]

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఫార్మాట్ ఏదైనా పరు గుల వరద పారిస్తూ ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి ఇంగ్లండ్ పిచ్‌లు కొర కరాని కొయ్యాగా మారాయి. ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షి ణాఫ్రికా, విండీస్ తదితర జట్లతో జరిగే టెస్టు సిరీస్‌లలో విరాట్ కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగి పోతాడు. అయితే ఇంగ్లండ్ గడ్డపై మాత్రం అత్యంత దారుణంగా విఫలమవుతు వస్తున్నాడు. ఇక్కడ ఆడిన పది ఇన్నింగ్స్ లలో ఒక్కసారి కూడా కనీసం అర్ధ సెంచరీ మార్క్‌ను కూడా అందుకోలేక పోయాడు. దీన్ని బట్టి ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో విరాట్ కోహ్లి ఎంత ఘోరంగా విఫలమ వుతున్నాడో చెప్పవచ్చు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో వరుస సెంచరీలతో అదరగొట్టాడు. అంతేగాక దక్షిణాఫ్రికాపై కూడా పరుగుల వర్షం కురిపించాడు. కానీ, ఇంగ్లీష్ గడ్డపై మాత్రం పేలవమైన రికార్డుతో సత మతమవుతున్నాడు.

ఈసారి మాత్రం..

గతంలో ఎలా ఆడినా సరే ఈసారి జరిగే సిరీస్‌లో మాత్రం చెలరేగాలనే పట్టుదలతో కోహ్లి ఉన్నాడు. దీని కోసం ప్రత్యేక ప్రణాళికతో సిద్ధమవుతున్నాడు. కాగా, ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు కౌంటీ క్రికెట్‌లో ఆడాలని భావించినా గాయం వల్ల ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. ఇక, అండర్సన్ బౌలింగ్‌లో కోహ్లికి చెత్త రికార్డు ఉంది. గతంలో ఇంగ్లండ్‌తో ఆడిన టెస్టుల్లో ఆరు ఇన్నింగ్స్‌లలో ఐదు సార్లు అండర్సన్ చేతిలోనే కోహ్లి ఔట్ కావడం విశేషం. ఈసారి కూడా కోహ్లిపై తన ఆధిక్యాన్ని కొనసాగించేందుకు అండర్సన్ తహతహలాడుతున్నాడు. కానీ, కోహ్లి మాత్రం ఈసారి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కనిపిస్తున్నాడు. గతంలో ఎదురైన చేదు అనుభవానికి ఈసారి బదులు తీర్చుకోవాలనే లక్షంతో ఉన్నాడు. కొంతకాలంగా టెస్టుల్లో కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న విషయం తెలిసిందే. గతంలో ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడూ టెస్టుల్లో కోహ్లి రికార్డు ఏమాత్రం బాగాలేదు. కానీ, సారథిగా మారిన తర్వాత కోహ్లి బ్యాటింగే మారి పోయింది. ప్రతి సిరీస్‌లోనూ చెలరేగి పోతున్నాడు. స్వదేశంలో, విదేశాల్లో అతనికి ఎదురు లేకుండా పోతోంది. ఎంతటి పెద్ద బౌలర్‌కైన చుక్కలు చూపించే సత్తా కోహ్లి సొంతం. అతను చెలరేగితే అడ్డుకోవడం ఇంగ్లీష్ బౌలర్లకు చాలా కష్టంతో కూడుకున్న పనిగా చెప్పవచ్చు. ప్రస్తుత సిరీస్‌లో కోహ్లి రాణించడం భారత్‌కు చాలా కీలకం. తనకు కొరకరాని కొయ్యగా మారిన అండర్సన్ అండ్‌కోకు తానెంటో నిరూపించాలనే పట్టుదల కోహ్లిలో కనిపిస్తోంది. ఈ సిరీస్‌ను కోహ్లి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. వన్డేల్లో, ట్వంటీ20లలో రాణించడం ద్వారా తన ఉద్దేశాన్ని ఇప్పటికే చాటాడు. రానున్న టెస్టు సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్‌గా కోహ్లికి పేరుంది. ఆ పేరుకు తగ్గట్టుగానే ఇంగ్లండ్ సిరీస్‌లో మెరుపులు మెరిపించాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యాడు. ఫాస్ట్ బౌలింగ్‌కు సహకరించే ఇంగ్లీష్ పిచ్‌లపై మెరుగ్గా రాణించడం ద్వారా తనపై వచ్చిన విమర్శలకు బదులు చెప్పాలని భావిస్తున్నాడు. ఇంగ్లీష్ బౌలర్లు అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, స్టోక్స్ తదితరులకు తన బ్యాటింగ్ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లి అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఈ సిరీస్‌ను భారత్ 40తో గెలిచిందంటే దానికి కోహ్లి మెరుగైన బ్యాటింగ్ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇక, కిందటిసారి ఇంగ్లండ్ పర్యటనలో పాల్గొన్న భారత్ టెస్టుల్లో అత్యంత అవమానక రీతిలో ఓటమి పాలైంది. ఆడిన ఐదు మ్యాచుల్లోనూ చిత్తు చిత్తుగా ఓడింది. ఈ సిరీస్ తర్వాత స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్‌పై అదే రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. భారత్ సాధించిన చిరస్మరణీయ విజయాల్లో విరాట్ కోహ్లి ముఖ్య భూమిక పోషించాడు. ఇక, ఈ సిరీస్‌లో కూడా కోహ్లి ప్రకంపనలు సృష్టించాలనే లక్షంతో సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొవడమే కాకుండా సహచరుల్లో ఆత్మ విశ్వాసం నింపాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. ధావన్, రాహుల్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె వంటి ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌లతో భారత్ చాలా బలంగా ఉంది. ఇటువంటి జట్టును ముందుండి నడిపిస్తే ఇంగ్లండ్‌ను ఓడించడం భారత్‌కు అసాధ్యమేమి కాదు.
విజయమే లక్షం..
సిరీస్‌ను పురస్కరించుకొని ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో తన లక్షం ఏమిటో కోహ్లి స్పష్టం చేశాడు. గతంలో ఇక్కడు తమ జట్టుకు ఘోర పరాజయం ఎదురైన విషయాన్ని తాను ఇంకా మరచి పోలేదు. గతంలో ఎదురైన అవమానకర ఓటమికి బదులు తీర్చుకోవడమే తన ఏకైక లక్షమన్నాడు. దీని కోసం సర్వం ఒడ్డేందుకు తాను సిద్ధంగా ఉన్నాను. ఇంగ్లండ్‌తో సిరీస్ ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. అయితే ఈసారి వారిని ఓడించడం ద్వారా తమ సత్తా ఏంటో చాటుతాం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తన వద్ద పదునైన అస్త్రాలు ఉన్నాయి. జట్టును ముందుండి నడిపించేందుకు తాను సిద్ధమయ్యాను. ప్రతి మ్యాచ్‌ను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుం. జట్టు సభ్యులంతా విజయమే లక్షంగా పెట్టుకున్నారు. సమష్టి పోరాటం ద్వారా ఇంగ్లండ్‌ను మట్టి కరిపిస్తాం. ఇంగ్లండ్‌ను వారి గడ్డపైనే ఓడించి తమది నిజమైన అగ్రశ్రేణి జట్టని నిరూపిస్తాం. దీని కోసం భారీ వ్యూహాలు తన వద్ద ఉన్నాయి. ఐదు మ్యాచుల్లోనూ గెలిచి అరుదైన రికార్డును నెలకొల్పుతాం.

కోహ్లిని కట్టడి చేస్తా: అండర్సన్

భారత్‌తో జ రిగే సిరీస్ తమకు స వాలు వంటిదే. ఈ సిరీస్‌లో ఇరు జట్లకు సమాన అవకాశాలున్నాయి. భారత్‌ను తేలిగ్గా తీసుకోం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు భారత జట్టులో కొదవలేదు. ఈసారి కూడా కోహ్లిని కట్టడి చేయడమే లక్షంగా పెట్టుకున్నాను. కోహ్లి ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో సందేహం లేదు. అతన్ని కట్టడి చేస్తే మ్యాచ్‌లో చాలా వరకు పైచేయి సాధించవచ్చు. కోహ్లిని ఎలా కట్టడి చేయాలో తనకు చాలా బాగా తెలుసు. గతంలో చాలా మ్యాచుల్లో అతన్ని తక్కువ స్కోరుకే పెవిలియన్ పంపించాను. ఈ సిరీస్‌లో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తా. కానీ, ఇది అనుకున్నంత తేలిక కాదు. ప్రపంచంలోని ఏ బౌలర్‌కైన చుక్కలు చూపించే సత్తా కోహ్లి సొంతం. అతన్ని కట్టడి చేయడం అనుకున్నంత తేలిక కాదు. అయితే తాను మాత్రం అతన్నే లక్షంగా చేసుకుని ముందుకు సాగుతా. కోహ్లితో పాటు రహానె, ధావన్, పుజారా, రాహుల్‌లు ప్రతిభావంతులైన ఆటగాళ్లే. అయితే కోహ్లిని తక్కువ స్కోరుకే పరిమితం చేస్తే మిగతావారిపై ఒత్తిడి పెంచడం తేలికవుతుంది. దీంతో కోహ్లి వికెట్ కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తాం.

Related Stories: