చెత్త కుప్పలో‌ గుర్తు తెలియని మృతదేహం!

Unknown Deadbody Found at dump in Hyderabad

హైదరాబాద్: చెత్త కుప్పలో‌ గుర్తు తెలియని మృతదేహం బయటపడిన సంఘటన సనత్ నగర్ పీఎస్ పరిధి భరత్ నగర్ లో జరిగింది. మున్సిపల్ సిబ్బంది చెత్తను తీస్తున్న సమయంలో మృతదేహం బయటపడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం నుండి భరించలేని దుర్వాసన వస్తుండటంతో, వ్యక్తి మృతి చెంది కనీసం వారం రోజులైన అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments