చెడ్డీగ్యాంగ్ అరెస్ట్

గుజరాత్‌లో ముగ్గురు అరెస్టు, పరారీలో మరికొందరు  మనతెలంగాణ/సిటీబ్యూరో : నగర పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించిన చెడ్డిగ్యాంగ్ సభ్యులను మీర్‌పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం సిసి టివి ఫుటేజీల్లోనే కనిపిస్తూ ఇటు ప్రజలను, అటు పోలీసులకు సవాల్‌గా చెడ్డీగ్యాంగ్ మారిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలను కంటిమీద కునుకులేకుండా చేసిన ఈ గ్యాంగ్ ముఠాలోని కీలక సభ్యులను గుజరాత్‌లోని దామోద్ ప్రాంతంలో రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్య కాలంలోనే నగరంలోకి ప్రవేశించిన ఈ గ్యాంగ్ […]

గుజరాత్‌లో ముగ్గురు అరెస్టు, పరారీలో మరికొందరు 

మనతెలంగాణ/సిటీబ్యూరో : నగర పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించిన చెడ్డిగ్యాంగ్ సభ్యులను మీర్‌పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం సిసి టివి ఫుటేజీల్లోనే కనిపిస్తూ ఇటు ప్రజలను, అటు పోలీసులకు సవాల్‌గా చెడ్డీగ్యాంగ్ మారిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలను కంటిమీద కునుకులేకుండా చేసిన ఈ గ్యాంగ్ ముఠాలోని కీలక సభ్యులను గుజరాత్‌లోని దామోద్ ప్రాంతంలో రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్య కాలంలోనే నగరంలోకి ప్రవేశించిన ఈ గ్యాంగ్ సభ్యులు కేవలం రాత్రివేళల్లో చెడ్డీ, బనియన్‌లను ధరించి దొంగతనాలకు, దాడులకు పాల్పడుతూ హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. మీర్‌పేట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ భవనంలోని ప్రక్క గదులకు తాళాలు వేసి ఓ ఫ్లాట్‌లో చోరీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే, దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఇంటిపై దాడికి దిగిన విషయం విధితమే. అయితే మీర్‌పేట్ చోరీ కేసులో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో ఈ గ్యాంగ్ మూలాలు పోలీసుల చేతికి చిక్కాయి. దీంతో వీరిని పట్టుకునేందుకు పక్కా ప్లాన్‌తో రాచకొండ పోలీసులు గుజరాత్ చేరుకున్నారు. అక్కడ మాటు వేసి ముగ్గురు నిందితులను ఆధారాలతో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరి వద్ద నుంచి సొత్తును స్వాధీనం చేసుకునే పనిలో పోలీసు అధికారులున్నారని తెలిసింది. మరో రెండు రోజుల్లో వారిని నగరానికి తీసుకురానున్నారు. అయితే వీరి ముఠాలోని మరికొందరు పరారీలోనే ఉన్నారు. వీరి ద్వారా వారి చిరునామాలను సేకరించి వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రణాళికలు రచిస్తూ, నిఘాను మరింత ముమ్మరం చేస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Comments

comments

Related Stories: