చెట్ల పొదల్లో పసికందు శవం

Female boby dead body available
చిట్యాల : మండలంలోని బోయగుబ్బ గ్రామంలో శుక్రవారం గుర్తు తెలియన పసికందు శవం లభ్యామైనట్టు ఐసిడిఎస్ అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం… ఒక ఇంటి బయట వున్న బాత్రూంలో గుర్తు తెలియని మహిళ పాపను ప్రసవించి తిరిగి అదే ఇంటి పరిసరాల్లోని చెట్ల పొదల్లో పడేసి పోయిందని తెలిపారు. కాగా.. ఆ ఇంటి యజమాని భార్య ఇంటి ముందు వాకిలి ఊకుతుండగా చెట్ల పొదల్లో పడి వున్న ఆడ పసికందు శవాని గమనించి చుట్టు పక్కల వారికి సమాచారం అందించిందాని , వారందరూ వచ్చి చూడగా శిశువు మృతి చెందివుంది. దాంతో గ్రామస్తులు ఆ పసికందు శవాన్ని వదిలి వెళ్లిన్నట్టుగా పోలీసులకు సమాచారం అందించారు. ఐసిడిఎస్ సిబ్బందితో గ్రామంలో గర్భవతుల లిస్టును అడిగి తెలుసుకున్నారు. కాగా.. ఆ శిశువు గ్రామానికి చెంది వుండదని భావిస్తున్నారు. ఐసిడిఎస్ సూపర్‌వైజర్ యశోద, అడిషనల్ సిడిపిఓ కవితలు గ్రామానికి వచ్చి పరిశీలించారు.

Comments

comments