చెట్టును ఢీకొన్న ప్రైవేటు బస్సు ఒకరి మృతి

రాయికల్‌: మండలంలోని ఉప్పుమడుగు గ్రామశివారులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని స్థానికులు 108 వాహనంలో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు చెట్టును ఢీకొన్న ఈ సంఘటనలో మల్యాల మండలం మనాల గ్రామానికి చెందిన కుడిదెల సాగర్ (33) అక్కడికక్కడే మృతి చెందగా మేడిపెల్లి మండలం వల్లంపెల్లి గ్రామానికి చెందిన చెట్‌పెల్లి రాజేందర్, రాయికల్‌కు చెందిన షారుక్‌లు తీవ్ర గాయాలకు గురయ్యారు. పోలీసుల కథనం మేరకు… […]

రాయికల్‌: మండలంలోని ఉప్పుమడుగు గ్రామశివారులో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని స్థానికులు 108 వాహనంలో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు చెట్టును ఢీకొన్న ఈ సంఘటనలో మల్యాల మండలం మనాల గ్రామానికి చెందిన కుడిదెల సాగర్ (33) అక్కడికక్కడే మృతి చెందగా మేడిపెల్లి మండలం వల్లంపెల్లి గ్రామానికి చెందిన చెట్‌పెల్లి రాజేందర్, రాయికల్‌కు చెందిన షారుక్‌లు తీవ్ర గాయాలకు గురయ్యారు. పోలీసుల కథనం మేరకు… జగిత్యాలకు చెందిన ఎస్‌ఆర్‌ఎం ట్రావెట్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు (ఎపి16టియు 3799) రాయికల్ మండలం మైతాపూర్‌కు అద్దెకు వచ్చి తిరిగి జగిత్యాలకు వెళ్లుతుండగా ఈ సంఘటన జరిగింది. బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా బస్సును నడుపుతూ రోడ్డు ప్రక్కనున్నచెట్టును ఢీకొట్టాడంతో బస్సులో ఉన్న క్లీనర్ సాగర్ క్యాబిన్‌లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ బస్సులోనే ఉన్న రాజేందర్ కాలు బస్సులోనే ఇరుక్కుపోయి కొట్టుమిట్టాడుతుండగా గమనించిన స్థానికులు అతన్ని బస్సులోంచి బయటకు తీసి ఆస్పత్రికి పంపించారు. మరో వ్యక్తి షారుక్‌కు గాయాలు కాగా ఇతన్ని ఆస్పత్రికి పంపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ కరుణకర్ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కాగా డ్రైవర్ ఫిరోజ్ పరారైయ్యాడని ఎస్‌ఐ తెలిపారు.