చీమలపాడులో కోతులు పట్టివేత

A group of monkeys in the village of cheemalapadu

కారేపల్లి: సింగరేణి మండల పరిధిలోని చీమలపాడు గ్రామంలో కోతుల గుంపు భీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామస్తుల ఫిర్యాదుతో స్పందించిన సర్పంచ్ మాలోత్ కిషోర్ కోతులను పట్టివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివారం కోతులను పట్టేవారిని రప్పించి గ్రామంలోని కోతులను పట్టి బోనులో బందించారు. కోంత కాలంగా గ్రామంలో కోతులు అలజడిని సృష్టిసున్నాయి. మహిళలను, పిల్లలను గాయాలపాలు చేస్తుండటంతో కోతుల నియంత్రణ చేయాలని గ్రామస్తులు కోరారు. దీంతో స్పందించిన సర్పంచ్ కోతులను పట్టేవారితో కోతులను బంధించి వాటిని అడవిలో వదిలేలా చర్యలు తీసుకున్నారు.

Comments

comments