చీకటంటే భయం

AliaBhat

ప్రముఖ దర్శకుడు మహేష్‌భట్ కుమార్తె అలియాభట్. 1999లో విడుదలైన హిందీ చిత్రం సంఘర్ష్‌లో బాలనటిగా సినీరంగప్రవేశం చేసింది. 2012లో విడుదలైన   స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ హిందీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.  సినిమాల్లోకి రాకముందు బొద్దుగా ఉండేది. తన మొదటి సినిమా కోసం మూడు నెలల్లో ఏకంగా 16 కిలోలు తగ్గి అందంగా తయారైంది.  తల్లి సోనీ రజ్దూన్ జర్మన్ దేశానికి చెందింది. పూజాభట్, రాహుల్‌భట్‌లు సవతి సోదరీసోదరులు.  నటుడు ఇమ్రాన్ హష్మి, డైరెక్టర్ మోహిత్ సూరి అలియాకి కజిన్స్. మొదటి సినిమా ఆడిషన్స్‌కి  400 మంది అమ్మాయిలు రాగా అలియా వాళ్లందరికంటే బాగా నటించి ఛాన్స్ కొట్టేసింది. 

నిక్‌నేమ్: అలూ, పుట్టింది : ముంబై, పుట్టిన తేదీ: మార్చి 15, 1993
చదువు: ముంబైలోని జమ్నాబాబ్ నర్సీ పాఠశాల,మంచి పేరు తెచ్చిన చిత్రాలు : టూ స్టేట్స్, హైవే, అభిరుచులు: పాటలు పాడటం, హైవే సినిమాలో సోహ సాహ అనే పాటపాడింది. అలియా రోల్‌మోడల్: కరీనాకపూర్, ఇండియన్ ఇండస్ట్రీలో కరీన్ బెస్ట్ అంటోంది. ఇద్దరూ కల్సి ఉడ్తాపంజాబ్ సినిమాలో నటించారు. అవార్డులు: రెండుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు తీసుకుంది. రీసెంట్ మూవీస్: ఈ మధ్యే విడుదలైన రాజీ సినిమాలో గూఢచారిణిగా నటించి మన్ననలు అందుకుంటోంది. బిజినెస్ ఉమెన్: సొంతంగా ఆన్‌లైన్‌లో జబాంగ్ డాట్‌కామ్ ద్వారా ఫ్యాషన్ రిటైలర్‌గా మారింది. ఇష్టమైన ఆహారం: రాగి చిప్స్, ఫ్రెంచ్‌ఫ్రైస్, రసగుల్లా, దహీచావల్, మూంగ్‌దాల్ హల్వా, ఫేవరెట్ పెర్ఫూమ్: గుస్సీ, ఫ్యాషన్ బ్రాండ్: ఫరెవర్ 21, టాప్‌షాప్, ఇష్టమైన ఆట: క్రికెట్, ఫేవరెట్ కలర్: రెడ్
అంతకు ముందు మాంసాహారి. 2015 తర్వాత శాకాహారిగా మారింది.
హోమ్‌లెస్ ఏనిమల్స్‌కోసం పెటా తరఫున కాంపెయిన్ చేస్తోంది. చీకటంటే భయం. లైట్లు వేసుకునే పడుకుంటానంటోంది. రాత్రి పడుకునేటప్పుడు ప్రతిరోజూ డైరీ రాయడం అలవాటు. నేను బద్ధకస్తురాల్ని 12 గంటలు పడుకోమన్నా పడుకుంటానంటోంది.