‘చి ల సౌ’థియేట్రికల్ ట్రైలర్ విడుదల

హైదరాబాద్: సుశాంత్, రుహాని శర్మ జంటగా హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తీస్తున్న తొలి చిత్రం ‘చి ల సౌ’. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్, రుని సినీ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. చాలా రోజులుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న సుశాంత్ కు ఈ సినిమా విజయం ఎంతో కీలకం. అలాగే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న మొదటి చిత్రం కావడంతో అతడికి కూడా ‘చి ల సౌ’ సక్సెస్ […]

హైదరాబాద్: సుశాంత్, రుహాని శర్మ జంటగా హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తీస్తున్న తొలి చిత్రం ‘చి ల సౌ’. తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్, రుని సినీ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. చాలా రోజులుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న సుశాంత్ కు ఈ సినిమా విజయం ఎంతో కీలకం. అలాగే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న మొదటి చిత్రం కావడంతో అతడికి కూడా ‘చి ల సౌ’ సక్సెస్ ముఖ్యమే. ట్రైలర్ చూస్తుంటే ఈ తరం కుర్రకారుకి ఎక్కే కంటెంట్ తోనే ఈ మూవీ రూపొందిందనే విషయం అర్థమవుతోంది. దీంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా వుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రశాంత్ విహారి స్వరాలు అందిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments

Related Stories: