చిల్లర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు : నాయిని

రాజన్న సిరిసిల్ల : ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ సిఎం అనేక పథకాలు అమలు చేస్తున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కదని ఆయన పేర్కొన్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం కెసిఆర్ రూ.400 […]

రాజన్న సిరిసిల్ల : ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ సిఎం అనేక పథకాలు అమలు చేస్తున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కదని ఆయన పేర్కొన్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం కెసిఆర్ రూ.400 కోట్ల రూపాయలను మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన వేములవాడలో పర్యటించారు. రాజన్న ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొత్తగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

Naini Narasimha Reddy Comments on Congress Leaders

Comments

comments

Related Stories: