చిలిపి చైతన్యగా ఆకట్టుకుంటాడు

Shailaja-Reddy-Alluduఅక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు నాగార్జున, నాని ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ “చైతన్యను ఇప్పు డు అందరూ శైలజారెడ్డి అల్లుడు అని అంటున్నారు. కానీ తను అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున పెద్ద కొడుకు. ప్రేమ కథా చిత్రాలైనా, ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలైనా అందు లో బలమైన మహిళా పాత్రలు ఉండాలని మా నాన్న ఇష్టపడతా రు. ఆయన వారసత్వాన్ని ఇప్పుడు చైతన్య తీసుకున్నారు. చైతన్య సాఫ్ట్ అనుకుంటారు. కానీ తనలో చిలిపితనం కూడా ఉంది. దాన్ని మారుతి చక్కగా వాడుకున్నారు. రమ్యకృష్ణ, నేను కలిసి ఎన్నో సినిమాలు చేశాం. అవన్నీ పెద్ద హిట్స్. ఇప్పుడు ఆమె చైతన్యకు అత్తయ్య
అయింది. బాహుబలి తర్వాత రమ్య అంటే ఇప్పుడు భారతదేశంలో తెలియనివారు లేరు. తను ఏ సీన్ చేసినా చక్కగా పండుతుంది. గోపీసుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు మారుతి. ఎక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలో తెలిసిన దర్శకుడు అతను. చైతన్య కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. నాని మాట్లాడుతూ “చైతన్యను చూస్తే అసూయగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో అతను ఎంత ఎంజాయ్ చేసుంటాడో నాకు అర్థమవుతుంది. మారుతి ఎంటర్‌టైనింగ్ పర్సన్. అలాంటి వ్యక్తి ఆరు నుండి తొమ్మిది నెలలు ఓ సినిమాపై వర్క్ చేశాడంటే సినిమా ఎంత వినోదాత్మకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో పాటలు, టీజర్, ట్రైలర్ చాలా బావున్నాయి. గోపీసుందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు”అని తెలిపారు. నాగచైతన్య మాట్లాడుతూ “కొత్త బాడీ లాంగ్వేజ్, ఎనర్జీతో నన్ను ఈ సినిమాలో చూపించినందుకు మారుతికి థాంక్స్. రమ్య మేడమ్‌ను దృష్టిలో పెట్టుకొని మారుతి నాకు ఈ కథ చెప్పారు. ఆవిడ లేకుంటే సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. అను ఇమ్మాన్యుయల్‌కు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది”అని పేర్కొన్నారు. రమ్యకృష్ణ మాట్లాడుతూ “శైలజారెడ్డి అల్లుడు ఓ పెద్ద పండుగలా ఉండబోతోంది. నాగచైతన్య చిలిపి చైతన్యగా ఆకట్టుకుంటాడు”అని చెప్పారు. మారుతి మాట్లాడుతూ “అక్కినేని అభిమానులు కోరుకున్నట్లుగా నాగచైతన్య తెరపై కనపడతారు. మంచి లవ్‌స్టోరీకి వినోదాన్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కించాం”అని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల్, అను ఇమ్మాన్యుయల్, నరేశ్, ఎస్.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments