చిరు తరువాతి మూవీ పేరు ఉయ్యాలవాడ కాదట..?

హైదరాబాద్: ఖైదీ నంబర్. 150 మూవీతో గ్రాండ్‌గా రీఎంట్రి ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మూవీ చిరు చరిష్మాతో భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక చిరు తరువాతి ప్రాజెక్ట్‌గా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మూవీ తెరకెక్కనుందనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి కన్‌ఫార్మ్ చేశారు. భారీ బడ్జెట్‌తో కొణిదేల ప్రొడక్షన్ బ్యానర్ పై చరణ్ ఈ మూవీని నిర్మించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. ఆగస్టు 15న […]

హైదరాబాద్: ఖైదీ నంబర్. 150 మూవీతో గ్రాండ్‌గా రీఎంట్రి ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మూవీ చిరు చరిష్మాతో భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక చిరు తరువాతి ప్రాజెక్ట్‌గా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మూవీ తెరకెక్కనుందనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి కన్‌ఫార్మ్ చేశారు. భారీ బడ్జెట్‌తో కొణిదేల ప్రొడక్షన్ బ్యానర్ పై చరణ్ ఈ మూవీని నిర్మించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పనులు ఊపందుకున్నాయి.

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూవీ లాంచింగ్ ఉండనుందని తెలుస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేది కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం అయిపోతుంది. కావున చిత్ర యూనిట్ అన్ని భాషలకు సరిపడా టైటిల్ కోసం వెదికారు. చివరకు అన్ని భాషలకు సరిపడేలా ‘మహావీర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దాదాపుగా ఇదే టైటిల్ ఖరారు కావొచ్చనేది చిత్ర వర్గాల సమాచారం.

Related Stories: