హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇవాళ 64వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు మెగా అభిమానుల నుంచి చిరుకు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ లు వెల్లువల వస్తున్నాయి. ఇక సైరా టీజర్ మంగళవారమే విడుదల చేసి మెగా అభిమానులను ఒక రోజు ముందుగానే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు మెగాస్టార్. పుట్టిన రోజు వేడుకలకు ఒక రోజు ముందుగానే విడుదలైన ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్ తో చిరు మరోసారి అభిమానులను ఫిదా చేశారు.
(వెంకటేష్: ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హ్యాపీ బర్త్ డే మెగాస్టార్)
(నాగార్జున: డియర్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు)
(అల్లు అర్జున్: మేనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు ఆవర్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్)
(ఈషా రెబ్బా: మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు)
(శ్రీకాంత్: మీకెంతో ప్రత్యేకమైన ఈ రోజు సుఖసంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే అన్నయ్యా)
(అనిల్ రావిపూడి: పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి గారు.. ఫోటోలో ఉన్నది నేనే. నాల్లో తరగతిలో ఉన్నప్పుడు అబ్బనీ తీయని దెబ్బ పాటకు డ్యాన్స్...)
(ప్రదీప్ మాచిరాజు: హ్యాపీ బర్త్ డే టు మా ‘ముఠామేస్త్రీ’, ‘గ్యాంగ్‌లీడర్’, ‘ది బాస్’)
(కొరటాల శివ: మా మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నాను సార్…)
(హరీశ్ శంకర్: హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్. చిత్రపరిశ్రమకు మీరు అందిస్తున్న మంచి సినిమాలకు, మాలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తూ, మాకూ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేలా చేస్తున్నందుకు గానూ థ్యాంక్స్. మీతో ఫోటో దిగే అవకాశం ఇచ్చినందుకు లవ్యూ…)
(అనుపమ పరమేశ్వరన్: ఎ ట్రు ఇస్పిరేషన్)
(సాయి ధరమ్ తేజ్: మీరు మాకు పంచిన స్ఫూర్తి, ప్రేమ ఎంతో పవిత్రమైనది. లవ్యూ మామా.. హ్యాపీబర్త్‌డే మెగాస్టార్)
(వరుణ్ తేజ్: నా స్ఫూర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు)
(వంశీ పైడిపల్లి: మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ప్రయాణం మాకెంతో స్ఫూర్తిదాయకం)
(శ్రీను వైట్ల: మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలి సార్…)
(రాధిక: నా ప్రియమైన మిత్రుడు, సహనటుడు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు రాక్‌స్టార్. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి)
(లావణ్య త్రిపాఠి: హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్ చిరంజీవి గారు. ‘సైరా’లో మీ లుక్ సూపర్.. ఓ మై గాడ్ దిస్ లుక్ కిల్లర్…)
Comments
comments