చిన్నారులతో బిక్షాటన

కోరుట్ల రూరల్: ఎలాంటి కష్టాలు చేసుకోలేని వికలాంగులు,వృద్దులు, బుద్ది మాంద్యులు యాచిస్తున్నరంటే ఆ మాటలు వేరు.కానీ ఏ లోపాలు లేకున్నా పనిచేసే శక్తిఉన్నా చిన్నారులను అడ్డుగా పెట్టుకుని యాచనలతోనే జీవనం సాగిస్తున్నారు. మండుటెండల్లో చిన్నారులను భుజాన వేసుకుని వీదులు,దుకాణల్లో భిక్షం వేయాలని అమాయకంగా అడుక్కుంటున్న క్రమంలో కాల్లు చేతులు బాగానే ఉన్నాయిగా ఏదైన పని చేసుకుని పిల్లల్ని పోషించరాద అంటే మౌనంగా ఉంటున్నారే తప్ప యాచనలు చేయడం మాత్రం మానడంలేదు.వారి తీరులతో దుకాణాల యాజామనులు ఎంతగా వరించిన […]

కోరుట్ల రూరల్: ఎలాంటి కష్టాలు చేసుకోలేని వికలాంగులు,వృద్దులు, బుద్ది మాంద్యులు యాచిస్తున్నరంటే ఆ మాటలు వేరు.కానీ ఏ లోపాలు లేకున్నా పనిచేసే శక్తిఉన్నా చిన్నారులను అడ్డుగా పెట్టుకుని యాచనలతోనే జీవనం సాగిస్తున్నారు. మండుటెండల్లో చిన్నారులను భుజాన వేసుకుని వీదులు,దుకాణల్లో భిక్షం వేయాలని అమాయకంగా అడుక్కుంటున్న క్రమంలో కాల్లు చేతులు బాగానే ఉన్నాయిగా ఏదైన పని చేసుకుని పిల్లల్ని పోషించరాద అంటే మౌనంగా ఉంటున్నారే తప్ప యాచనలు చేయడం మాత్రం మానడంలేదు.వారి తీరులతో దుకాణాల యాజామనులు ఎంతగా వరించిన ప్రయోజనం శూన్యంగానే మారుతున్నాయి. మరి కొందరు భిక్షం వేయలేని వారి పట్ల ఆగ్రహంతో ఊగుతున్నారు. వారితో ఎందుకులే ఎదో చిల్లర వేస్తే వెల్లిపోతారని దాదాపు చాలా మంది దుకాణాదారులు తమకు తోచినంత ఇచ్చి వెల్లమనే వారిని నిత్యం ఏదో ఒక చోట చూస్తునే ఉంటాం.

బిక్షం కుల వృత్తనే మాటలు: చెమట చుక్క చిందించక తేరగ వచ్చే డబ్బులకోసం బిక్షం కంటే సులువు మార్గంగా మరోటి లేదని యాచనలతో జీవనం సాగిస్తున్నారు. నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నా అడుక్కోవడం ఎందుకంటే బిక్షం మా కుల వృత్తి అందుకే అడుక్కుంటాం అనే ఎదురు సమాదానలు చేపుతు వరిస్తున్నారు.ఆలయాలు,మసీదుల ముందు యాచించే వారు ఈ మద్య పెల్లిల్లు శుభాకార్యలు జరిగే ప్రాంతాలకు చేరుకుని యాచనలు మొదలుపెట్టారు. మరి కొందరు 40 ఎళ్ళ బయస్సున్న మగాళ్ళు సైతం బిక్షటానలు చేస్తు సాయంత్రం పూట మధ్యం మత్తులో ఊగుతున్నారు. కనీసం కూలీ పనికి వెల్లిన 300 వందలకు పైగా వస్తున్న రోజుల్లో అవే భిక్షాటనలు చేస్తు కాలం గడుపుతున్నారు. స్వశక్తి మీద బ్రతకాలని వృద్దులు, చిన్నారులు సైతం ఏవో పనులు చేసుకునే వారిని చూసైన ఆ యాచకుల్లో మార్పులు రావాలనే కోరుకుందాం.

దేవుళ్ళ చిత్రపటాలతో…దుకాణాలు,వీదుల్లో బిక్షాటనలు చేసే వారి సంఖ్య దినదినం పేరుగుతునే ఉంది. మరి కొందరు యాచకులు దేవుళ్ళ చిత్రపటాలను పెట్టుకుని మరీ యాచిస్తున్నారు. మరి కొందరు పలాన దేవుడికి చందాలు రాయాలని బుక్కులు వెంటపెట్టుకుని రోడ్లపైకి వచ్చేవారు ఈ మద్య అధికమౌతున్న క్రమంలో నిజమైన యాచకుల లేక కష్టపడలేని సోమరి పోతుల అని తెలుసుకోలేని నేటి రోజుల్లో దుకాణాదారులు సందిద్గంలోనే ఉంటున్నారు. పనిచేసే శక్తి ఉన్నావారు యాచనలు చేస్తున్న తరుణంలో వృద్దులు,వికలాంగులు,చిన్నారుల పట్ల జాలీ చూపుతూ తోచిన చిల్లర వేసే వారు కోప్పడంలో ఆశ్చర్యలేముంటాయి..

Comments

comments

Related Stories: