చిన్నారిని చిత్రహింసలు పెట్టిన తల్లి!

హైదరాబాద్: ప్రియుడితో సహజీవనానికి అడ్డుగా ఉందని కన్న కూతురినే చిత్రహింసలకు గురిచేసింది ఓ కసాయి తల్లి. కొన్ని నెలలుగా నరకం అనుభవిస్తున్న ఆ చిన్నారికి బాలల హక్కుల సంఘం వారు అండగా నిలిచారు. తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె చెర నుండి చిన్నారిని విడిపించి శిశుగృహానికి తరలించారు. సోమవారం మలక్‌పటే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం… న్యూప్రశాంత్ నగర్‌కు చెందిన వెంకన్న, సరితలకు కొన్ని సంవత్సరాల క్రితం […]

హైదరాబాద్: ప్రియుడితో సహజీవనానికి అడ్డుగా ఉందని కన్న కూతురినే చిత్రహింసలకు గురిచేసింది ఓ కసాయి తల్లి. కొన్ని నెలలుగా నరకం అనుభవిస్తున్న ఆ చిన్నారికి బాలల హక్కుల సంఘం వారు అండగా నిలిచారు. తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె చెర నుండి చిన్నారిని విడిపించి శిశుగృహానికి తరలించారు. సోమవారం మలక్‌పటే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం… న్యూప్రశాంత్ నగర్‌కు చెందిన వెంకన్న, సరితలకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి రేణుక(3) అనే పాప జన్మించింది. వెంకన్న, సరితలకు మనస్పర్థలు వచ్చి విడిపోయారు.

ఈ క్రమంలో సరితకు స్థానికంగా నివసించే ఓ డిసిఎం డ్రైవర్‌తో పరిచయం ఏర్పడి సహజీవనానికి దారి తీసింది. సరిత సంతోషాలకు తన 3 ఏళ్ల పాప రేణుక అడ్డుగా ఉందని బావించి హింసించడం ప్రారంభించింది. సరితకు ఆమె ప్రియుడూ తోడయ్యాడు. రోజు కొట్టడం, వాతలు పెట్టడం చేసేవారు. వీరి చిత్రహింసలకు చిన్నారి ఒళ్లంతా గాయలయ్యాయి. చెయ్యి విరిగింది. రేణుక ఏడుపులు పక్కవారికి వినపడకుండా ఉండేందుకు నోటిలో గుడ్డలు కుక్కి మరీ కొట్టేవారు. విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుతరావు సోమవారం మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి వద్ద రేణుకకు రక్షణ లేకపోవడంతో ఆ చిన్నారిని శిశుసదన్‌కు తరలించారు. సరితపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

అండగా శిశుసదన్‌లు : అచ్యుత రావు
పిల్లలకు కూడా స్వేచ్చగా జీవించే హక్కులు ఉన్నాయని బాలల హక్కుల సంఘం నాయకులు అచ్చుతరావు తెలిపారు. తలిదండ్రులమనే హక్కుతో పిల్లలనను కొట్టే అధికారం లేదని వివరించారు. పిల్లల స్వేచ్చా జీవితానికి ఎవ్వరు అడ్డు పడ్డా వారు శిక్షార్హులు అని తెలిపారు. తలిదండ్రుల సంరక్షణ కొరవడిన పిల్లలలకు శిశుసదన్‌లు అండగా ఉంటాయని పేర్కొన్నారు. శిశుసదన్‌లో చక్కని బసతో పాటు మంచి ఆహారం, నాణ్యమైన విద్య అందుబాలులో ఉన్నాయని వివరించారు. చిత్రహింసలకు గురవుతున్న పిల్లల విషయం బాలల హక్కుల సంఘం దృష్టికి తీసుకు వస్తే అండగా నిలుస్తామన్నారు.

Related Stories: