చిన్నవని చిన్నచూపు వద్దు..!

తాతయ్య, బామ్మలు ఆరోగ్యంగా ఉన్నారంటే రహస్యం చిరుధాన్యాల ఆహారం ఎక్కువగా తీసుకోవడమే.  చిన్నగా ఉన్నాయి అని వాటిపై చిన్నచూపు చూడొద్దు.  చిన్నధాన్యాలే ఆరోగ్యానికి మేలు అని ఎప్పుడూ రుజువు చేస్తూనే ఉన్నాయి. వీటిని  ఆహారంలో  ప్రతిరోజూ ఒక భాగంగా ప్రయత్నించి చూడండి…

nuts

జొన్నలు : గోధుమలు, బియ్యం, మొక్కజొన్న తర్వాత అధికంగా పండే పంట జొన్న. గుండె సంబంధిత వ్యాధులు,
క్యాన్సర్, టైప్ టు డయాబెటీస్, న్యూరోలాజికల్ వ్యాధులు దరిచేరకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. చర్మ క్యాన్సర్ కూడా దరిచేరకుండా చేస్తుంది. కడుపు నొప్పి, వాంతులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయట
పడేస్తుంది. వీటిలో అధికంగా ఉండే విటమిన్ బి 6 ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

సజ్జలు: సజ్జలను నేతిలో వేయించి పొడి చేసి పిల్లలకు, బలహీనంగా ఉన్న వారికి పాలలో కలిపి తాగిస్తే దేహదారుఢ్యం, మనోబుద్ధి పెంపొందుతుంది. బెల్లంతో కలిపి తింటే రక్తహీనత తగ్గుతుంది. ఇందులో పోషక విలువలు ఎక్కువ. మొలకలు కట్టుకుని తినవచ్చు. సజ్జ అన్నం, సజ్జ రోటి, సజ్జ బూరెలు ఇలా రకరకాల వంటలు చేసుకోవచ్చు.

రాగులు : దక్షిణ భారతదేశం అంతటా అనేక గ్రామాలలో ఒక ప్రధానమైన ఆహారం ఇది. వీటిలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్ పుష్కలంగా లభిస్తాయి. అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రి స్తాయి. వాటిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి, రక్తపోటును తగ్గించటానికి బాగా సహాపడుతుంది. బాలింతలలో పాల ఉత్పత్తికి రాగులు బాగా తోడ్పడతాయి.

సోంపు : ఈ గింజల్లో రాగి, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఇనుము, సెలెలియం, మాంగనీస్, కాల్షియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. మల మూత్రనాళాలకు తరచూ ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా సోంపు విత్తనాలు కాపాడుతాయి. సోంపు టీ తాగటం వల్ల శరీరంలో ఉండే అధిక కొవ్వు కరుగుతుంది. వివిధరకాల పేగు సంబంధిత సమస్యలు రాకుండా సంరక్షిస్తుంది. ఒక కప్పు సోంపు గింజల్లో, ఒక రోజుకు అవసరమయ్యే విటమిన్ సి 20% లభిస్తుంది.సోంపు టీ సేవించినా లేదా సోంపు గింజల్ని నమిలినా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

అవిశెలు : ఇవి చాలా శక్తివంతమైన ఆహారం. పీచు, ఖనిజాలు, మాంసకృత్తులు సమృద్ధిగా ఉన్నాయి. రోజువారి ఆహారంలో తీసుకుంటే రొమ్ముకాన్సర్ లాంటి వ్యాధులు రావు. మోకాళ్ల నొప్పులు, జీర్ణసంబంధ వ్యాధులు రాకుండా వీటిలోని లింగనాన్స్ ఎంతో మేలు చేస్తాయి. ఈస్ట్రోజన్ గుణాలు అధికం. ఎముకలు దృఢంగా ఉండటానికి, ఆడవారిలో రుతు సమస్యలు తగ్గుతాయి. జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రతిరోజూ ఒక టీ స్పూన్ గింజలను నమిలి చప్పరించి మింగడం వల్ల ఉదర సంబంధ వ్యాధులు రావు.

Comments

comments