చినుకు పడితే చిత్తడిగా చేగుంట బస్టాండ్

Passangers Facing Problem In Chegunta Bustand In Medak
చేగుంట: మండల కేంద్రమైన చేగుంటలో ఉన్న ఆర్టీసి బస్టాండ్ కొద్దిపాటి చినుకలకే మడ్లగా మారి చిత్తడిగా మారిపోతుంది. చేగుంట ఆర్టీసి నుండి ఎంతో లాభాలు ఉన్నా ఆర్టీసి బస్టాండ్ చుట్టు పక్కల బస్సులు నిలిచే స్థలంలో బాగు చేయాలని పట్టించుకునే నాదుడే లేరు. గతంలో దుబ్బాక ఎమ్మె ల్యే రామలింగారెడ్డి గారు ప్రయాణికుల ఇబ్బందులు తెలసుకుని ఆర్టీసి డీయంను బస్టాండ్‌కు పిలిపించి పరిసరాలు చూపించి త్వరగా బస్టాండ్ ఆవరణ మొత్తం సిసి వేయాలని అదేశించారు. కాని అధికారి బదిలీపై వెళ్ళ డం మళ్ళీ అదే స్థితిలో గుంతలుగా చేగుంట బస్టాండ్ ఉంది. క్యాంటిన్ ద్వారా కూడా చేగుంట నుండి ఆదాయం బాగానే ఉంది. అయినా ఆర్టీసి అధికారులు పట్టించుకోవడంలేదు. వానాకాలం వచ్చిందంటే ప్రయాణికులు బస్టాండ్ లో బస్సు ఎక్కాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటారు. అధికారులు పట్టించుకుని ఆర్టీసి బస్టాండ్ చుట్టు సిసి వేయించాలని ప్రయాణికులు కొరారు.